ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gulf Victim : గల్ఫ్‌ చెర నుంచి బయటపడిన మహిళ

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:38 AM

ఏజెంట్‌ మాటలు నమ్మి మోసపోయిన కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామానికి చెందిన గల్ఫ్‌ బాధితురాలు ..

  • మంత్రి సుభా్‌షకు బాధితురాలి వీడియో సందేశం

  • స్పందించిన మంత్రి లోకేశ్‌.. ఆయన సహకారంతో స్వగ్రామానికి

  • బాధితురాలిది కోనసీమ జిల్లా ‘అంతర్వేది కర’

రామచంద్రపురం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఏజెంట్‌ మాటలు నమ్మి మోసపోయిన కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామానికి చెందిన గల్ఫ్‌ బాధితురాలు గంటా దీప్తి ఎట్టకేలకు స్వగ్రామానికి చేరింది. భర్త, పిల్లల వైద్యానికి అవసరమైన డబ్బు కోసం ఏజెంటు కేతా శ్రీనివాస్‌ ద్వారా దీప్తి బహ్రెయిన్‌ వెళ్లింది. అక్కడ అక్టోబరు 24న ఓ ఇంట్లో పనికి చేరింది. చిన్న ఇంట్లో పని అనిచెప్పి నాలుగు అంతస్తుల భవనంలో వెట్టి చాకిరీ చేయిస్తూ చిత్ర హింసలకు గురిచేశారు. సరైన తిండి కూడా పెట్టకుండా నిర్బంధించారు. దీంతో దీప్తి తీవ్ర అనారోగ్యానికి గురైంది. తనను చెర నుంచి విడిపించాలని మంత్రి సుభా్‌షకు వీడియో సందేశం పంపింది. ఆయన స్పందించి మంత్రి లోకేశ్‌, బహ్రెయిన్‌లో ఏపీ నాన్‌రెసిడెన్షియల్‌ తెలుగు సొసైటీకి చెందిన శివకుమార్‌ ద్వారా సౌదీలోని ఇండియన్‌ ఎంబసీతో మాట్లాడారు. దీప్తిని అక్కడి చెర నుంచి విడిపించి స్వగ్రామానికి తీసుకువచ్చారు. కాగా.. మంగళవారం దీప్తి తన భర్తతో కలసి రామచంద్రపురంలో మంత్రి సుభా్‌షను కలిశారు. తనను వెట్టిచాకిరీ, నిర్బంధం నుంచి కాపాడిన మంత్రులు సుభాష్‌, లోకేశ్‌కు దీప్తి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 18 , 2024 | 04:38 AM