ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gummadi Sandhya Rani: దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటూ.. జగన్‌పై కౌంటర్ల వర్షం

ABN, Publish Date - Jul 22 , 2024 | 07:25 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రంలో..

Gummadi Sandhya Rani

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhya Rani) నిప్పులు చెరిగారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే ఆద్యులని ఆరోపించారు. దెబ్బలు, కొట్లాటలతో అల్లకల్లోల వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. అలాంటి నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు. అబద్ధాలు ఆడటం వారికి వెన్నతో పెట్టిన విద్య అని తూర్పారపట్టారు. దమ్ముంటే జగన్ రెడ్డి తన బాబాయి వైఎస్ వివేకా హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు.


చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్లు.. జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడని మంత్రి సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు నిజంగానే ప్రజాస్వామ్యం కోరే నాయకులైతే.. ముందుగా వివేకా హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని అన్నారు. డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరి చేసిన ఓ హంతకుడు.. ప్లకార్డులు పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. తాము కక్షపూరితంగా వెళ్లాలంటే.. తమ నాయకుడు కనుసైగ చేస్తే చాలని, తమ కార్యకర్తలే వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కానీ.. తమ నాయకుడు క్రమశిక్షణ నేర్పించారు కాబట్టే చట్టప్రకారం వెళ్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు దిగుతున్నారని.. టీడీపీ నేతలు సహనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే.. టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి తెలియజేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.


అసలు జగన్ చేసిన వ్యాఖ్యలేంటి?

పల్నాడు జిల్లా వినుకొండలో (Vinukonda Incident) జరిగిన రషీద్ హత్య వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు తమ పొలిటికల్ మైలేజ్‌ కోసం వాడుకుంటున్నారు. జగన్ కూడా దీనిపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపిని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇందుకు కౌంటర్‌గానే మంత్రి సంధ్యారాణి పైవిధంగా స్పందించారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 07:25 PM

Advertising
Advertising
<