Guntur : విదేశీ నేస్తాలు వచ్చేశాయ్
ABN, Publish Date - Oct 20 , 2024 | 04:13 AM
పక్షుల కిలకిలరావాలు, విదేశీ పక్షుల విన్యాసాలతో గుంటూరు జిల్లా ఉప్పలపాడు పులకిస్తోంది. గ్రామంలో ఎటు చూసినా పక్షుల విన్యాసాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
పక్షుల కిలకిలరావాలతో ఉప్పలపాడు కళకళ
పక్షుల కిలకిలరావాలు, విదేశీ పక్షుల విన్యాసాలతో గుంటూరు జిల్లా ఉప్పలపాడు పులకిస్తోంది. గ్రామంలో ఎటు చూసినా పక్షుల విన్యాసాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. శీతాకాలం ప్రారంభ సమయంలో వలస పక్షులు ఇక్కడకు వచ్చి గుడ్లు పొదుగుతాయి. ఈ నెలలో అత్యధికంగా ఓపెన్ బిల్డ్ స్టార్క్ పక్షులు తరలి వచ్చాయి. దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడి దాకా వలస వచ్చాయి. ఇంకా... వైట్ హైవేస్, డాటర్/ ేస్నక్ బర్డ్, నీటికాకులు, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్ తదితర జాతుల పక్షులూ ఉప్పలపాడుకు వస్తాయి. సంతానోత్పత్తి తర్వాత తిరిగి నవంబరు, డిసెంబరు నెలల్లో స్వస్థలాలకు వెళ్లిపోతాయి. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు.
- ఆంధ్రజ్యోతి, పెదకాకాని
Updated Date - Oct 20 , 2024 | 04:13 AM