Anna Canteens: అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాల సేకరణ.. ప్రత్యేక ఖాతా తెరిచిన ప్రభుత్వం..
ABN, Publish Date - Aug 15 , 2024 | 09:34 PM
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరాళాలు స్వీకరిస్తోంది. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారికోసం ఎస్‌బిఐలో ప్రత్యేక ఖాతాను తెరిచింది.
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరాళాలు స్వీకరిస్తోంది. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారికోసం ఎస్‌బిఐలో ప్రత్యేక ఖాతాను తెరిచింది. పేద ప్రజల ఆకలి కష్టాలను తీర్చేందుకు, రోజువారీ కూలీలకు భోజన ఖర్చు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో రాయితీపై అల్పాహరం, భోజనం అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఓ రకంగా అన్నదాన కార్యక్రమం కావడంతో విరాళాలు ఇచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో విరాళాల సేకరణకు ప్రత్యేక ఖాతా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5కే భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను మూసివేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. మళ్లీ అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో గురువారం సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించబోతుంది. పేద ప్రజలకు ఆకలిని తీర్చు కార్యక్రమం కావడంతో పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్య ప్రజలు సైతం అన్న క్యాంటీన్లకు విరాళాలు అందిస్తున్నారు. బుధవారం ఒక్కరోజు ప్రభుత్వానికి అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం రూ.2కోట్లకు పైగా విరాళాలు అందాయి. దీంతో ప్రజల ఆసక్తిని గమనించిన ప్రభుత్వం సేకరించిన విరాళాలకు అకౌంట్‌బులిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎస్‌బిఐలో ప్రత్యేక ఖాతా తెరిచింది.
handrababu: అన్నా క్యాంటిన్ శాశ్వతంగా కొనసాగించాలి.. ఇదే నా ఆకాంక్ష
ఆన్‌లైన్‌లో విరాళాలు ఇలా..
ప్రభుత్వానికి నేరుగా విరాళాలు అందించలేని వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా లేదా చెక్కులను అన్నక్యాంటీన్లకు సంబంధించిన ఖాతాలో జమచేయవచ్చు. ఈ ఖాతాకు వచ్చిన మొత్తం నగదును అన్న క్యాంటీన్ల నిర్వహణకు వినియోగించనున్నారు.
ఖాతా వివరాలు
ఖాతా పేరు: అన్న క్యాంటీన్స్ (ANNA CANTEENS)
ఖాతా నెంబర్: 37818165097
బ్రాంచి: చంద్రమౌళినగర్, గుంటూరు
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్: SBIN0020541
Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని
దాతల సహకారంతో..
అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి రోజుకు 96 రూపాయిలు ఖర్చు అవుతుందని. ఆహారం తినే వ్యక్తి రూ.15 చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం లేదా దాతలు భరిస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తామని చెప్పగానే ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారని ఆయన తెలిపారు. అన్న క్యాంటీన్లు మళ్లీ పెడతామంటే శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి కోటి రూపాయిల విరాళం ఇచ్చారన్నారు. తన భార్య నారా భువనేశ్వరి సైతం కోటి రూపాయిలు విరాళాన్ని అందజేశారన్నారు. మరింతమంది దాతలు ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. ఎవరైనా ఇంట్లో పెళ్లి జరిగితే.. వివాహ ఖర్చు కొంత తగ్గించుకుని అన్న క్యాంటీన్లకు విరాళం అందించాలన్నారు. డిజిటల్ రూపంలోనూ ఎస్‌బిఐ ఖాతాకు విరాళాలు పంపవచ్చన్నారు.
Pawan kalyan: ఆద్యతో పవన్ సెల్ఫీ.. నెట్టింట పెద్ద ఎత్తున వైరల్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Aug 15 , 2024 | 09:34 PM