AP Politics: పవన్ కళ్యాణ్‌తో డీజీపీ భేటీ.. ఆ విషయంలో కీలక ఆదేశాలు..
ABN, Publish Date - Nov 09 , 2024 | 08:31 PM
రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు, హోంమంత్రితోనూ డీజీపీ సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సామాజిక మాద్యమాల్లో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో డీజీపీ ద్వారకా తిరుమలరావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలపై డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు, హోంమంత్రితోనూ డీజీపీ సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సామాజిక మాద్యమాల్లో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ పోలీసుల తీరు మార్చుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగానే సూచించారు. అప్పటినుంచి పోలీసుల తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఓవైపు మరోవైపు సీఎం చంద్రబాబు సైతం తప్పుచేసేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు శాఖ సీరియస్ యాక్షన్ స్టార్ట్ చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు, అసత్య ప్రచారానికి పాల్పడుతూ.. కొందరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వ్యక్తుల పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వ్యక్తులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో డీజీపీ భేటీపై ఏయే అంశాలు చర్చించారనేది ఆసక్తిగా మారింది.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లప్రోలులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అక్కడ ఫార్మా పరిశ్రమతో వ్యర్థాలు, పిల్లలపై లైంగికదాడుల గురించి ప్రస్తావిస్తూ శాంతి,భద్రతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అభిప్రాయ పడ్డారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. లైంగికదాడికి తెగబడే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరుగుతున్న ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని కోరారు. సంబంధిత మంత్రులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, తాను ప్రత్యేక దృష్టిసారించామని, అయినప్పటికీ కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదన్నారు. నిజాయితీగా పనిచేయాలని చెబితే మీనమేషాలు లెక్కిస్తున్నారని, మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకుని వచ్చేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తాను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని, ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను డీజీపీ కలవడం ఆసక్తి రేపుతోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 09 , 2024 | 08:31 PM