ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబు రక్షణకు సీఆర్‌పీఎఫ్‌

ABN, Publish Date - Oct 17 , 2024 | 05:15 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షణ బాధ్యతలు ఇకపై సీఆర్‌పీఎఫ్‌ చూసుకుంటుంది. తిరుపతిలోని అలిపిరిలో చంద్రబాబుపై నక్సల్‌ దాడి (2003 అక్టోబరు) జరిగినప్పటి నుంచి,

CM Chandrababu Naidu

యోగి, రాజ్‌నాథ్‌ సహా పలువురికి ఇక పారామిలిటరీ రక్షణే

ఎన్‌ఎస్‌జీ సేవలు ఇకపై యాంటీ టెర్రర్‌ ఆపరేషన్లకే

కేంద్ర హోంశాఖ ఆదేశాలు.. నెల రోజుల్లో బదలాయింపు పూర్తి..


అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షణ బాధ్యతలు ఇకపై సీఆర్‌పీఎఫ్‌ చూసుకుంటుంది. తిరుపతిలోని అలిపిరిలో చంద్రబాబుపై నక్సల్‌ దాడి (2003 అక్టోబరు) జరిగినప్పటి నుంచి, గత 21 సంవత్సరాలుగా ఆయనకు రక్షణగా ఉన్న ఎన్‌ఎస్‌జీ....ఇక ఉగ్రవాద చర్యల నిరోధానికే పరిమితం కానుంది. దానిస్థానంలో సీఆర్పీఎఫ్‌కు బాధ్యతలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఈ కేటగిరీలో ఉన్నారు. వీరందరినీ సీఆర్పీఎఫ్‌ భద్రతా వలయంలోకి తీసుకురానున్నారు. సీఆర్పీఎఫ్‌ విభాగంలో వీఐపీ భద్రతా అవసరాల కోసం ఆరు బెటాలియన్లు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఏడుకు పెంచనున్నారు. ఇప్పటికే మంత్రి లోకేశ్‌కు సీఆర్పీఎఫ్‌ బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్‌ఎస్‌జీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని బ్లాక్‌ క్యాట్స్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో ఎన్‌ఎస్‌జీ గార్డ్స్‌ ధైర్యం, తెగువ, స్ఫూర్తికి నమస్కరిస్తున్నా.. అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 17 , 2024 | 07:33 AM