YCP: వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో వెలుగులోకి సంచలన విషయాలు..
ABN, Publish Date - Jun 23 , 2024 | 11:53 AM
అమరావతి: తాడేపల్లిలోని వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసిన వైనంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు.
అమరావతి: తాడేపల్లిలోని వైసీపీ (YCP) అక్రమ నిర్మాణం కూల్చివేతతో (Demolition of illegal construction) మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు (Valuable lands) కొట్టేసిన వైనంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్‌లను పార్టీ కార్యాలయం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) కొట్టేసింది. జిల్లా కేంద్రంలో నగరం నడిబొడ్డున రెండేసి ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) భూములు రాయించుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం వైసీపీ రాయించుకున్న భూముల విలువ రూ.900 నుండి రూ.1000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
26 జిల్లాల్లో ఒక్క పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా వైసీపీ అధిష్టానం అనుమతులు తీసుకోలేదు. నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను నాటి జగన్ సర్కార్ యథేచ్ఛగా కేటాయించుకుంది. ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి రూ.15 కోట్ల నుండి రూ.20 కోట్లు ఖర్చు.. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ రిచ్‌గా ఉండేలా ప్రణాళిక చేశారు. భూముల విలువ, భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులు కలిపితే కనీసం రూ. 2000 కోట్లు అవుతుందని నిర్మాణ రంగ నిపుణల అంచనా వేశారు.
ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయం ఒక్కో ప్యాలెస్‌లా జగన్ నిర్మించారు. ప్రతి కట్టడం రాజభవనాన్ని తలపించేలా నిర్మాణాలు చేశారు. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఇంత ఖర్చు లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. కేంద్రంలో సుధీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ గానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి గానీ ఈ స్థాయి కార్యాలయ భవనాలు లేవని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు
రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..
8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం
రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?
రాజీనామాకు సిద్ధమైన జగన్ అభిమాన అధికారులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 23 , 2024 | 11:57 AM