ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: దుష్టసంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ జగన్ ఆగ్రహం

ABN, Publish Date - Oct 09 , 2024 | 04:06 PM

Andhrapradesh: ‘‘ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం’’ అని జగన్ అన్నారు.

Former CM YS Jaganmohan Reddy

అమరావతి, అక్టోబర్ 9: మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) అన్నారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలు (YSRCP Leaders), కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వానలని.. ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

CM Chandrababu: ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టం..


నేను చేయొద్దని చెప్పినా...

రెడ్‌బుక్‌ అనేది ఏమైనా పెద్దపనా.. ఎప్పుడూ లేని దుష్టసంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Govt) తీసుకు వచ్చిందని విమర్శించారు. ‘‘ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం’’ అని అన్నారు. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నామని వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయన్నారు.

Majority Votes in Haryana: హర్యానాలో మెజార్టీపై అదంతా అబద్ధం.. ఇదే నిజం


మనం ముందడుగు వేశాం..

‘‘ పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరు చూడండి. ప్రతి అంశంలోనూ తిరోగమనం కనిపిస్తోంది. వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టాలనుంచే నాయకులు పుడతారు. నన్ను16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం’’ అని పార్టీ నేతల సమావేశంలో జగన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

CM Chandrababu: ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2024 | 04:25 PM