ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రీన్‌గ్రేస్‌ బిల్డింగ్స్‌ని కాపాడేందుకు తెరచాటు ప్రయత్నాలు

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:51 AM

గుంటూరు నడిబొడ్డున తగిన అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గ్రీన్‌గ్రేస్‌ హైరైజ్డ్‌ బిల్డింగ్స్‌ని కాపాడేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫ ఆర్‌టీఐ ద్వారా సేకరించిన టీడీపీ నాయకులు

ఫ సీఎం చంద్రబాబుకు నివేదన

గుంటూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నడిబొడ్డున తగిన అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గ్రీన్‌గ్రేస్‌ హైరైజ్డ్‌ బిల్డింగ్స్‌ని కాపాడేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కీలకమైన రైల్వే ఎన్‌వోసీ రద్దుకు సంబంధించి సవరణలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులకు సమాచారం అందింది. మునిసిపల్‌ పరిపాలన శాఖలోనే కొంతమంది హైరైజ్డ్‌ బిల్డింగ్స్‌ని నిర్మిస్తున్న వైసీపీ నేత అంబటి మురళీకృష్ణకు సానుకూలంగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్‌వోసీ రద్దు సవరణ ఉత్తర్వులు రహస్యంగా విడుదల చేయడం ఇందుకు ఊతమిస్తున్నది. రహస్య జీవో సమాచారాన్ని ఆర్‌టీఐ ద్వారా సేకరించిన టీడీపీ నేతలు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

భజరంగ్‌ జూట్‌మిల్లుకు చెందిన వివాదాస్పద స్థలాన్ని వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ తన ఆధీనంలోకి తీసుకొని తొలుత ఐదు అంతస్తుల అపార్టుమెంట్ల నిర్మాణానికి మునిసిపల్‌ పరిపాలన శాఖ నుంచి అనుమతులు పొందారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో రివైజ్డ్‌ ప్లాన్‌ దరఖాస్తు చేసి దానికి అనుమతి రాకముందే 15 అంతస్తుల భవన సముదాయాలను నిర్మించారు. ఈ క్రమంలో ఎన్నో నిబంధనలను అతిక్రమించారు. గుంటూరు - నల్లపాడు రైలుమార్గానికి ఆనుకునే నిర్మాణాలు చేపట్టారు. రైల్వే నుంచి ఐదు అంతస్తుల భవన సముదాయాలకు మాత్రమే ఎన్‌వోసీ తీసుకొన్నారు. ఎప్పుడైతే అంతకంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణం చేపట్టారో రైల్వే శాఖ తాను జారీ చేసిన ఎన్‌వోసీ రద్దు అయినట్లే భావించాలని పేర్కొంటూ తగిన చర్యలు చేపట్టాలని నగరపాలకసంస్థ అధికారులకు సమాచారం ఇచ్చింది. అయితే అప్పట్లో అంబటి మురళీకృష్ణ సోదరుడు అంబటి రాంబాబు మంత్రిగా ఉండడంతో ఏ ఒక్క ప్రభుత్వ శాఖ అధికారి, సిబ్బంది గ్రీన్‌గ్రేస్‌ అపార్టుమెంట్స్‌ ప్రాంగణంలోకి అడుగుపెట్టే సాహసం చేయలేకపోయారు.

కాగా ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓటమిపాలై ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆర్‌టీఐ ద్వారా ఉల్లంఘనలన్నింటిని వెలుగులోకి తీసుకొచ్చారు. 15 అంతస్తులకు బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌ రాకపోవడం, సెట్‌బ్యాక్స్‌ సరిగా లేకపోవడం, రైలు పట్టాల నుంచి దూరంగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా కేవలం 50 అడుగుల దూరంలోనే నిర్మాణాలు చేయడం, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతులు లేకపోవడం వంటివి అనేక ఉల్లంఘనలు బయటకు వచ్చాయి. రైల్వే ఎన్‌వోసీ రద్దుపై కోర్టుకు వెళ్లినా అంబటి మురళీకృష్ణకు ఊరట లభించలేదు. కాగా మునిసిపల్‌ పరిపాలన శాఖలో కొంతమంది ఆయనకు సహకరిస్తున్నారన్న అనుమానాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి కలుగుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది మునిసిపల్‌ అధికారులు, మురళీకృష్ణ సామాజికవర్గానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు గ్రీన్‌గ్రేస్‌ అపార్టుమెంట్స్‌ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ గుంటూరు జిల్లా నాయకలు సందేహిస్తున్నారు. ఎన్‌వోసీ రద్దు సవరణ జీవోని రహస్యంగా ఇచ్చిన విషయంపై తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. దీనిపై సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Updated Date - Dec 22 , 2024 | 01:51 AM