I&PR: డిప్యూటీ సీఎం పర్యటనపై ఐఅండ్ పీఆర్ నిర్లక్ష్యం..
ABN, Publish Date - Nov 10 , 2024 | 10:58 AM
గుంటూరు జిల్లా: ఏపీలోని సమాచార శాఖ ఉద్యోగులకు ఇంకా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మత్తు వీడలేదు. ప్రజా ప్రతినిధుల పర్యటన సమాచారంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలపై ఐఅండ్ పీఆర్ పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. ఆదివారం గుంటూరులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఐఅండ్‌పీఆర్ సమాచారం ఇవ్వలేదు.
గుంటూరు జిల్లా: ఏపీలోని సమాచార శాఖ ఉద్యోగులకు ఇంకా వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వ మత్తు వీడలేదు. ప్రజా ప్రతినిధుల పర్యటన సమాచారంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పర్యటనలపై (Tour) ఐఅండ్ పీఆర్ (I&PR) పూర్తి నిర్లక్ష్యం (Neglect) వహిస్తోంది. ఆదివారం గుంటూరు (Guntur)లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఐఅండ్‌పీఆర్ సమాచారం ఇవ్వలేదు. అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల పరిశీలన సమాచారం కూడా ఇవ్వలేదు. ఇటీవల జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా సమీక్షకు ఐఅండ్ పీఆర్ అధికారులు సమాచారం ఇవ్వలేదు. జనసేన ప్రజా ప్రతినిధులపై సమాచారం శాఖ నిర్లక్ష్యంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు.
కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. పాలెంలోని అటవీ అమరవీరుల(Forest Martyrs) సంస్మరణ సభ జరగనుండగా.. పవన్ ఈ సభకు హాజరు కానున్నారు. పాలెంలోని అరణ్య భవన్‌లో ఈరోజు జరిగే అటవీ అమరవీరుల సంస్మరణ సభకు హాజరయి, ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు నివాళులు అర్పించనున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెడుతున్న వారిని ఆయన సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేస్తే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామనేలా జగన్ మాటలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను బెదిరిస్తారా?
" ఏపీ పోలీస్ వ్యవస్థను మాజీ సీఎం జగన్ బెదిరిస్తున్నారు. గత ముఖ్యమంత్రి ఇటీవల మీడియా సమావేశంలో పోలీసులను బెదిరిస్తున్న తీరును మనమంతా చూశాం. తమను అరెస్టులు చేస్తే సప్త సముద్రాలు దాటి వచ్చి పగ తీర్చుకుంటామన్నట్లు మాట్లాడుతున్నారు. ఇది కచ్చితంగా పోలీస్ వ్యవస్థను బెదిరించడమే. సోషల్ మీడియాలోనైనా, మీడియా ముఖంగానైనా పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు( జనసేన కార్పరేషన్ ఛైర్మన్లు) మాత్రం ఇష్టానుసారం సబ్జెక్టు లేకుండా వారిలా మాట్లాడొద్దు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఎక్కడా మాట మీరకుండా ముందుకు వెళ్లండి. వైసీపీ నేతలు పాలసీలపై మాట్లాడరు, కేవలం వివాదాలే కావాలి. మీరు మాత్రం పాలసీల మీద, పాలసీలపైనే చర్చలు చేయండి. అంతేగాని తప్పుడు వ్యాఖ్యలు చేయెుద్దు. ముఖ్యంగా ఇళ్లల్లో ఉన్న మహిళలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయెుద్దు. సబ్జెక్టుపై చాలా బలంగా మాట్లాడండి. ఏ సమస్య ఉన్నా నా పేషీ దృష్టికి తీసుకురండి. ఆ సమస్య పరిష్కారం అయ్యేలా తప్పనిసరిగా కృషి చేద్దాం. వైసీపీ నేతల్లా నీచంగా మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించండి. తప్పు చేసిన వారిని నాయకుడే సమర్థిస్తుంటే నేతలు, కార్యకర్తలు అలా కాక ఇంకెలా తయారవుతారు. నాయకుడు అనే వాడు తప్పు చేసింది తమ వారే అయినా శిక్షించాలి. అలా కాకుండా వారే ప్రోత్సహిస్తే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు" అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..
రక్షణ కోరుతున్న వైసీపీ సైకోలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 10 , 2024 | 11:11 AM