ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పల్నాడు జిల్లా నూతన ఎస్పీ

ABN, Publish Date - May 20 , 2024 | 08:48 PM

పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లిక గార్గ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించడమే తన ముందున్న మొదటి లక్ష్యమని తెలిపారు. లా ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు ఉండేదని ఆమె ప్రస్తావించారు.

పల్నాడు: పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లిక గార్గ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించడమే తన ముందున్న మొదటి లక్ష్యమని తెలిపారు. లా ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు ఉండేదని ఆమె ప్రస్తావించారు. ప్రస్తుతం జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా పల్నాడు జిల్లాలో అశాంతి నెలకొందని, తిరిగి ప్రశాంతత పరిస్థితులను నెలకొల్పేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.


రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్‌ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మల్లిక గార్గ్ హెచ్చరించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌‌లో తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో, అనంతరం కూడా చోటుచేసుకున్న హింసకు బాధ్యులుగా ఉన్న ఎస్పీని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో మల్లిక గార్గ్‌ని ఈసీ నియమించింది.

Updated Date - May 20 , 2024 | 08:48 PM

Advertising
Advertising