Minister Narayana: సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు పనులపై మంత్రి నారాయణ సమీక్ష..
ABN, Publish Date - Jul 22 , 2024 | 10:01 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 24 గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) సమీక్ష నిర్వహించారు. సిటీస్(CITIIS)ఛాలెంజ్ ప్రాజెక్టు కింద మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 24గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 24 గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) సమీక్ష నిర్వహించారు. సిటీస్(CITIIS)ఛాలెంజ్ ప్రాజెక్టు కింద మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 24గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయా పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
పనుల స్థితిగతులపై నారాయణ ఆరా తీశారు. వచ్చే నెలాఖరులోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులో భాగంగా 14 ప్రభుత్వ పాఠశాలలు,17 అధునాతన అంగన్వాడీ సెంటర్లు, 16 ఈ-హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, బహుళ అత్యాధునిక పర్యావరణ శ్మశానవాటిక నిర్మిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.
Updated Date - Jul 22 , 2024 | 10:03 PM