ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM: నేటి నుంచి పవన్ కల్యాణ్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష..

ABN, Publish Date - Sep 22 , 2024 | 07:30 AM

అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు.

అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉపముఖ్యమంత్రి (Deputy CM) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. ‘‘అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష (Prayaschitta Deeksha) చేయాలని సంకల్పించాను.


ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష (Deeksha) కొనసాగిస్తాను. 11 రోజుల (11Days) పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. 'దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ'ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది.

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది’’. ధర్మో రక్షతి రక్షితః


తిరుమల పవిత్రతకు ఉద్దేశపూర్వకంగానే పాతర వేశారని తేలిపోయింది. తవ్వేకొద్దీ జగన్‌ అరాచక పాలన సృష్టించిన సంక్షోభం తెలిసి వస్తోంది. అధికారంలోకి రావడం రావడమే తిరుమల పాలనను అస్తవ్యస్తం చేసేశారు. అత్యంత వివాదాస్పదులుగా ముద్రపడిన తన బంధువులకు, అధికారులకు టీటీడీ పగ్గాలు అప్పగించి, వారి ఇష్టారాజ్యానికి కలియుగ దైవాన్నీ, భక్తులనూ వదిలేశారు. నాణ్యతకు, పవిత్రతకు భరోసా ఇచ్చిన డెయిరీల నుంచి నెయ్యి సేకరణను ఆపివేయించడం జగన్‌ అరాచకపర్వానికి పరాకాష్ఠ. నచ్చిన కంపెనీలకు నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూ పవిత్రతను సైతం మంటగలిపేశారు.


రాష్ట్రంలోని టీటీడీ సహా ప్రముఖ ఆలయాల అవసరాల కోసం నెయ్యిని స్థానిక సహకార డెయిరీల నుంచి కొనుగోలు చేసేవారు. తిరుమల పవిత్రతను, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక డెయిరీల నుంచి మంచి నెయ్యిని సేకరించేవారు. దీనికోసం అప్పటి ప్రభుత్వాలు జీవో 418ను కూడా జారీచేశాయి. ఈ ప్రక్రియను ఈ - ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారా చేపట్టాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరింత బలపరుస్తూ 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మరొక సర్యూలర్‌ జారీచేసింది. ప్రముఖ ఆలయాల్లో ఉపయోగించే నెయ్యిని కూడా స్థానిక సహాకార డెయిరీల నుంచి కొనుగోలు చేయాలని అందులో స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది మాసాలకే టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020లో నెయ్యి ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ అప్పటివరకు తిరుమల ఆలయం అవసరాల కోసం సరఫరా చేస్తున్న నందినీ బ్రాండ్‌ నెయ్యిని నిలిపివేసింది. దీంతో తిరుమల పవిత్రత అనేది పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా గత జగన్‌ ప్రభుత్వం నాడు ఎంపిక చేసిన ఐదు కంపెనీల్లో ఒకటి సరఫరా చేసిన నెయ్యిలోనే పంది, ఎద్దు కొవ్వు, చేప నూనెలు, వెజిటబుల్‌ ఆయిల్‌ ఉన్నట్టు బయటపడటం, దానిపై దేశమంతా భగ్గుమనడం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌.. మహా పాతకం!

చరిత్రహీనుల్లా మిగిలిపోయేలా శిక్షిస్తాం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 22 , 2024 | 07:30 AM