ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు

ABN, Publish Date - May 31 , 2024 | 01:13 AM

జిల్లాలో సామాజిక పింఛన్‌ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లత్కర్‌ గురువారం తెలిపారు.

నరసరావుపేట, మే 30: జిల్లాలో సామాజిక పింఛన్‌ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లత్కర్‌ గురువారం తెలిపారు. జిల్లాలో 2,80,568 మంది లబ్ధిదారులకు రూ.83.79 కోట్లు చెల్లించాలన్నారు. మొత్తం పింఛన్లలో 2,05,568 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు రూ.61.68 కోట్లు జమ చేస్తామన్నారు. 74,899 మంది లబ్ధిదారులకు రూ22.08 కోట్లు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామన్నారు. పింఛన్‌దారులు సచివాలయాల వద్దకు రానవసరంలేదని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం లేదా సాయంత్రం సమయంలో బ్యాంకులకు వెళ్లి పింఛన్‌ తీసుకోవాలని కలెక్టర్‌ లబ్ధిదారులకు సూచించారు. ఇంటివద్ద పింఛన్‌ పంపిణీ కోసం మధ్యాహ్నం 2 గంటల లోపు బ్యాంక్‌ల నుంచి సొమ్ము విత్‌ డ్రా చేయాలని సిబ్బందికి తెలిపారు. 1 నుంచి 5వ తేదీ సాయంత్రం లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకుల వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషన్‌ర్లు, ఎంపీడీవోలను కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - May 31 , 2024 | 01:13 AM

Advertising
Advertising