Andhra Pradesh: పీహెచ్‌డీ.. రూ.10 లక్షలు!
ABN, Publish Date - Jul 07 , 2024 | 09:16 AM
విద్యకు ఆలయంగా ఉండాల్సిన వర్సిటీలు వైసీపీ హయాంలో అక్రమాలకు అడ్డాగా మారాయి. పైసలు, వైసీపీ నేతల అండతోనే పదవులతో పాటు డిగ్రీలు కూడా పం పిణీ చేశారు. సాధారణంగా పీహెచ్‌డీ రావాలంటే ఏళ్లుగా ఆ అంశంపై పరిశోధనలు చేసి..
గుంటూరు: విద్యకు ఆలయంగా ఉండాల్సిన వర్సిటీలు వైసీపీ హయాంలో అక్రమాలకు అడ్డాగా మారాయి. పైసలు, వైసీపీ నేతల అండతోనే పదవులతో పాటు డిగ్రీలు కూడా పం పిణీ చేశారు. సాధారణంగా పీహెచ్‌డీ రావాలంటే ఏళ్లుగా ఆ అంశంపై పరిశోధనలు చేసి.. అందులో నిష్ణాతులుగా మారి.. వివిధ పరీక్షలు ఎదుర్కొని.. తమ మేధస్సుతో పలువుర్ని మెప్పించాలి. కానీ వైసీపీ హయాంలో అలాంటి వాటితో సంబంధం లేకుండానే యథేచ్ఛగా పీహెచ్‌డీల ప్రదానం జరిగింది. ఈ కోవలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కూడా చేరినట్లు విమర్శలు, ఆరోపణలున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ విభాగంలో రోజుకో కొత్త దందా వెలుగు చూస్తోంది. పీహెచ్‌డీ కోసం వచ్చే దరఖాస్తుదారులు వర్సిటీకి రూ.వేలల్లో ఫీజులతో పాటు గైడ్లకు లక్షలు ముట్టచెప్పినట్లు పలువురు స్కాలర్లు వాపోతున్నారు.
కొంతమంది గైడ్‌లు థీసెస్ రాయించడానికి స్కాలర్స్ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని సమాచారం. కొంతమంది గైడ్లు తాము చెప్పిన వారి దగ్గరే థీసెస్ రాయించమని స్కాలర్స్‌పై ఒత్తిడి తెచ్చి 50 శాతం తీసుకున్నట్లు సమాచారం. మరికొందరు థీసెస్ మీద సంతకాలకు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని స్కా లర్స్ ఆవేదన. ఎడ్యుకేషన్ విభాగంలో ఓ అధికారికి రూ.10 వేలు ఇస్తేకానీ వైవాలో ప్రశ్న లు అడగరని ప్రచారం ఉంది. మరో అధికారి కారు చార్జీలు, మూడు నక్షత్రాల హోటల్‌లో విందులంటూ స్కాలర్స్‌ను పిండేశారు. మరికొందరు వైవాకు హాజరు కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని హుకుం జారీ చేస్తు న్నారు. సెమినార్స్ సందర్భంగా రూ.5 వేల నుంచి రూ.25 వేలు దండు కుంటున్నారు. ఇలా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు స్కాలర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీర విధేయులకే పదవులు..
వర్సిటీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఒక్కరు తప్ప మిగతా అందరూ వైసీపీకి వీర విధేయులే అనే ప్రచారం ఉంది. టీడీపీ వారికి పదవులు ఇవ్వొద్దని ఓ మాజీ అధికారిణి వీసీకి లేఖ ఇచ్చినట్లు సమా చారం. మాజీ మంత్రి అండతో మరో అధికారిణి ప్రతి పనికి రేటు కట్టి వసూళ్లకు తెగబడుతున్నట్లు ఆరోపణ లున్నాయి. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను బహిరంగంగా విమర్శించడంతోనే ఈమెకు పదవి దక్కినట్లు ప్రచారం.
అక్రమాలు ప్రశ్నిస్తే వేధింపులే..
ఎడ్యుకేషన్ విభాగంలో జరిగే అక్రమాలను పశ్నిస్తే వేధింపు లకు గురిచేస్తున్నారని స్కాలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందిపై అక్రమంగా కేసులు కూడా బనాయించారు. ఓ అధ్యాపకుడిపై అట్రాసిటీ కేసు పెడితేనే మీ బంధువుకు పీహెచ్‌డీ వస్తుందని డీఎస్పీ స్థాయి అధికారిని ఓ గైడ్ బెదిరిం చినట్లు సమాచారం. కుల సంఘాల నేతలతో దాడులు సర్వ సాధారణమయ్యాయని స్కాలర్స్ వాపోతున్నారు.
Updated Date - Jul 07 , 2024 | 09:16 AM