ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఫైర్‌

ABN, Publish Date - Jun 16 , 2024 | 12:24 PM

అమరావతి: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఫైర్‌ అయ్యారు. తాడేపల్లిలో జగన్‌ తన సొంత ఇంటి కోసం.. నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటిని సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని, దీని కోసం సుమారు రూ. కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు.

అమరావతి: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)పై తెలుగుదేశం అధికారప్రతినిధి (TDP Leader) పిల్లి మాణిక్యరావు (Pilli Manikya Rao) ఫైర్‌ (Fire) అయ్యారు. తాడేపల్లిలో జగన్‌ తన సొంత ఇంటి కోసం.. నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటిని సీఎం క్యాంప్ కార్యాలయంగా (CM Camp Office) మార్చుకుని, దీని కోసం సుమారు రూ. కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. దోచుకుని దాచుకున్న జగన్‌ ఇంట్లోని ఫర్నీచర్‌.. విలువైన వస్తువులను ప్రభుత్వానికి లెక్కచెప్పి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.


అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ, సోపా తన క్యాంప్ కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఆయనను దొంగగా ముద్ర వేసి. ఆత్మహత్య చేసుకునేలా చేశారని మాణిక్యరావు మండిపడ్డారు. కోడెల మరణానికి జగనే కారణమని, కోడెల మాదిరి జగన్‌కు ఆత్మగౌరవం ఉందనుకోవట్లేదని అన్నారు. జగన్.. ఏ అఘాయిత్యం చేసుకోవద్దని అన్నారు. ఫర్నీచర్‌, ఇతర విలువైన వస్తువులను.. ప్రభుత్వానికి అప్పగిస్తే చాలని మాణిక్యరావు అన్నారు.


కాగా అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ, సోపా తన క్యాంప్ కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా జగన్ ఇంట్లోనే ప్రభుత్వ ఫర్నీచర్ ఉంటే ఏం సమాధానం చెబుతారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా జగన్ క్యాంపు నివాసానికి సెక్యూరిటీ, ఫర్నీచర్ రూపేన రూ. 3 కోట్ల 63 లక్షల వ్యయం చేసిన జీవోను కూడా బయటకు తీశారు. 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు తన క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను జగన్ ఎందుకు వెనక్కి పంపలేదని నిలదీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం

టీటీడీ అవకతవకలపై సీఎం సీరియస్

దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..

కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 16 , 2024 | 12:29 PM

Advertising
Advertising