ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అధికారం అండతో పిన్నెల్లి బ్రదర్స్‌ దారుణాలు

ABN, Publish Date - May 23 , 2024 | 01:05 AM

రాష్ట్రంలో అధికార వైసీపీ అరాచకాలు, గూండారాజ్యానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అయన సోదరుడి అకృత్యాలు ఒక ఉదాహరణ మాత్రమేనని మాజీ మంత్రి, చిలక లూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజ మెత్తారు.

చిలకలూరిపేట అర్బన్‌, మే 22 : రాష్ట్రంలో అధికార వైసీపీ అరాచకాలు, గూండారాజ్యానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అయన సోదరుడి అకృత్యాలు ఒక ఉదాహరణ మాత్రమేనని మాజీ మంత్రి, చిలక లూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజ మెత్తారు. శాంతి భద్రతలపై క్షేత్ర స్థాయిలో పోలీసు, అధికార వ్యవస్థ మొత్తం వైసీపీకి పాదాక్రాంతమైన దుస్థితిపై టీడీపీ తరుపున ఫిర్యాదులు అందినప్పుడే ఎన్నికల సంఘం చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేదా? అని ప్రశ్నించారు. బుధవారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రంలో చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసేంత ధైర్యం వారికి వచ్చిందంటే ఈసీ, పోలీసుల అలసత్వం కాదా? అని నిలదీశారు. పాలువాయిగేటు ఎన్నికల కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో చర్యలు తీసుకోవడానికి ఇన్నిరోజులు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ప్రత్తిపాటి డిమాండ్‌ చేశారు. పల్నాడుజిల్లా వ్యాప్తంగా జరిగిన హింసకు, ఈవీఎం ధ్వంసానికి కారణమైన వ్యక్తిని హౌస్‌ అరెస్టు నుంచి తప్పించింది ఎవరు?, ఇన్ని రోజులుగా అతను ఎక్కడ దాక్కున్నాడు? స్థానిక పోలీసుల సహకారం లేకుండా పిన్నెల్లి సోదరులు పల్నాడు నుంచి పారిపోవడం సాధ్యమేనా? వంటి విషయాలన్నింటికీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, డీజీపీ సమాధానం చెప్పి తీరాలన్నారు. తమ మార్కు రౌడీయిజంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికే మాయ నిమచ్చ తెచ్చిన పిన్నెల్లి సోదరులకు కఠిన శిక్షలు పడేలా చేయ టంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాలంలో నిషేదం విధించాలని ప్రత్తిపాటి డిమాండ్‌ చేశారు.

Updated Date - May 23 , 2024 | 01:05 AM

Advertising
Advertising