TDP: ‘రా కదిలిరా’ సభకు పోలీసుల అడ్డంకులు
ABN, Publish Date - Feb 15 , 2024 | 06:56 AM
అమరావతి: ఈ నెల 17 వ తేదీన బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ‘రా కదిలిరా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే సభ నిలుపుదలకు కుట్ర పన్నారు. సభకు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది.
అమరావతి: ఈ నెల 17 వ తేదీన బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ‘రా కదిలిరా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే సభ నిలుపుదలకు కుట్ర పన్నారు. సభకు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. సర్కార్ తీరుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశవరావు మండిపడ్డారు. అధికారంతో సభను అడ్డుకోలేరని అన్నారు. పోలీస్ అధికారులతో వైసీపీ ప్రభుత్వం తన మార్కు రాజకీయానికి తెర లేపిందని విమర్శించారు. దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారని.. రాత్రి సమయాల్లో, పోలీసులు పనులు నిలిపివేయాలంటూ హుకుం జారీ చేశారని.. ప్రభుత్వ కుట్రలను మానుకోవాలని.. లేకుంటే ప్రజాక్షేత్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఏలూరి సాంబశవరావు అన్నారు.
జగన్ అరాచక పాలనను సాగనంపేందుకే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలిరా’ సభతో శంఖారావం పూరిస్తున్నారని ఆపార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మోల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈ నెల 17న బాపట్ల పార్లమెంట్ పరిధిలో రా కదిలిరా బహిరంగ సభ ఇంకొల్లులో నిర్వహిస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాన్ని వివరించి ప్రజలను చైతన్యం చేసేందుకు రా కదిలిరా పేరుతో చంద్రబాబు ఈనెల 17న ఇంకొల్లులో తారకరామ విజయభేరి ప్రాంగణంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సుమారు లక్ష మంది లక్ష్యంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏలూరి సాంబశవరావు చెప్పారు.
Updated Date - Feb 15 , 2024 | 06:56 AM