జగన్‌కు సలహాదారును
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:24 AM
అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు తాను సలహాదారుగా ఉన్నానని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ వెల్లడించాడు.
అందుకే సజ్జల, పీఎస్ఆర్ ఆదేశాలతో నాకు గన్‌మెన్‌ను ఇచ్చారు: బోరుగడ్డ
పాత కారు అమ్మితే వచ్చిన డబ్బులతో సెకండ్ హ్యాండ్ ఓల్గార్స్ కారు కొన్నా
బాబుప్రకాశ్ ఎవరో నాకు తెలియదు పోలీసుల విచారణలో అనిల్ వెల్లడి
గుంటూరు అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు తాను సలహాదారుగా ఉన్నానని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ వెల్లడించాడు. అందువల్లే నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి నిఘా చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు ఆదేశాలతో తనకు గన్‌మెన్ సౌకర్యం కల్పించారని చెప్పాడు. గుంటూరులో ఏఈఎల్‌సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకాశ్‌ను బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేశారన్న కేసులో నిందితుడిగా ఉన్న బోరుగడ్డను అరండల్‌పేట పోలీసులు ఆదివారం విచారించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏ హోదాలో నీకు ప్రభుత్వం గన్‌మెన్ సౌకర్యం కల్పించిందని పోలీసులు ప్రశ్నించగా.. అనిల్ పై విధంగా జవాబిచ్చాడు. రూ.80 లక్షల ఖరీదైన ఓల్గార్స్ కారు ఎలా వచ్చింది.. చాలా మంది చర్చి పాస్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల గురించి అడుగగా.. తన పాత కారు అమ్మగా వచ్చిన రూ.28 లక్షలతో పాటు తన ఐదుగురు సిస్టర్స్ ఇచ్చిన డబ్బులతో రూ.45 లక్షలతో సెకండ్ హ్యాండ్ ఓల్గార్స్ కారు కొన్నానని అనిల్ చెప్పాడు. ఆ కారును తన తల్లికి గిఫ్టుగా ఇచ్చామన్నాడు. తాను ఎవరినీ బెదిరించలేదని.. తనపై ఫిర్యాదు చేసిన బాబుప్రకాశ్ ఎవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. ముందుగా 50 లక్షలు డిమాండ్ చేసి ఆ తర్వాత బాబుప్రకాశ్ కార్యాలయానికి వెళ్లి కత్తితో బెదిరించి తెచ్చుకున్న రూ.లక్షను ఏం చేశావని పోలీసులు ప్రశ్నించారు. ఆయనెవరో తెలియనప్పుడు రూ.లక్ష ఎలా ఇస్తాడని అనిల్ వ్యాఖ్యానించాడు. ఎవరో తెలియనప్పుడు నీపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటి.. అందులోనూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదు చేశాడు కదా అని ప్రశ్నించగా.. వైసీపీలో దళిత వర్గం నుంచి తాను ఎదగడం చూసి ఓర్చుకోలేక తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటాడని అనిల్ చెప్పాడు.
వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు
గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్న బోరుగడ్డను అరండల్‌పేట పోలీసులు ఆదివారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏమి లేవని, గ్యాస్ర్టిక్ ట్రబుల్ మాత్రమే ఉందని గుర్తించి అందుకు అవసరమైన టాబ్లెట్స్ ఇచ్చారు. దీంతో అతడిని తిరిగి అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మూడ్రోజుల కస్టడీలో భాగంగా సోమవారం కూడా అతడిని విచారించనున్నారు.
Updated Date - Oct 28 , 2024 | 09:17 AM