ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Budget: ఏపీలో బీసీ కులాలు, జనాభాపై క్లారిటీ.. బడ్జెట్‌లో స్పష్టం చేసిన ప్రభుత్వం

ABN, Publish Date - Nov 11 , 2024 | 04:11 PM

బీసీ జనాభా శాతం ఎంత అనే విషయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టంగా పేర్కొంది. మొత్తం 138 బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, వీరిని ఐదు గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ-ఏ, బీ, సీ, డి, ఇ వర్గాలుగా ..

BC Population In AP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికిగానూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీ సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఏడాదికి రూ.15వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఏపీలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి. బీసీ జనాభా శాతం ఎంత అనే విషయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టంగా పేర్కొంది. మొత్తం 138 బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, వీరిని ఐదు గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ-ఏ, బీ, సీ, డి, ఇ వర్గాలుగా విభజించగా బీసీ-ఏలో 51 కులాలు, బీసీ-బీలో 27 కులాలు, బీసీ సీలో ఒక కులం, బీసీ-డిలో 45 కులాలు, బీసీ-ఇలో 14 కులాలు ఉన్నట్లు బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏ వర్గంలో ఏ సామాజిక వర్గాలు వస్తాయనే విషయాన్ని పేర్కొంది. క్రిస్టియన్లుగా మతం మారిన షెడ్యూల్ క్యాస్ట్‌కు చెందిన వారు బీసీ-సీలోకి వస్తారని, ముస్లింలలో సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన వారిని బీసీ-ఈగా గుర్తించినట్లు తెలిపింది.


రూ.75వేల కోట్లు

బీసీ సబ్ ప్లాన్ కింద రానున్న ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024-25 సంవత్సరానికి రూ.15వేల కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీ కులాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. బీసీ కులాల్లో స్వయం ఉపాధి కోసం పథకాలు తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అగ్రికల్చర్ మార్కెటింగ్ కోపరేషన్ కోసం రూ.కోటి 52 లక్షలు, అగ్రికల్చర్ విభాగం కోసం రూ.514,45.69(లక్షల్లో), బీసీ వెల్ఫేర్ కోసం రూ.19254,93.61 (లక్షల్లో) బడ్జెట్‌లో కేటాయించారు. బీసీ యువత, మహిళా సాధికారిత కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్‌లో స్పష్టం చేశారు. నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి రంగంలో బీసీల కోసం కేటాయింపులు చేసింది.


బీసీలకు ఇళ్లు..

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద గృహ నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ.లక్షా 80వేల వరకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కో ఇంటి నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం రూ.లక్షా 30వేలు, మిగతా జిల్లాల్లో ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. లక్షా 20వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేల వరకు ఇస్తుందని పేర్కొంది. బీసీల్లో పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 11 , 2024 | 04:11 PM