Ramoji Rao: రామోజీకి నివాళిగా.. ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు
ABN, Publish Date - Jun 08 , 2024 | 05:43 PM
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) నేడు(శనివారం) తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందిన విషయం తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మరణించారు.
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) నేడు(శనివారం) తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందిన విషయం తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మరణించారు.
గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకపోవడంతో రామోజీ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. అయితే రామోజీరావు నివాళిగా 2 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఈ మేరకుఅధికారిక ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 9, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఏ వేడుకలు నిర్వహించ రాదని పేర్కొంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాగా.. రామోజీ అంత్యక్రియలు రేపు(ఆదివారం) ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో జరుగనున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపనున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను సీఎస్ శాంతికుమారి జారీ చేశారు. ఫిలింసిటీకి పలువురు ప్రముఖులు వచ్చి సంతాపం ప్రకటిస్తున్నారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని కంటతడి పెట్టారు.
రామోజీరావు వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 08 , 2024 | 06:42 PM