YS Jagan: కొత్త లిక్కర్ పాలసీపై జగన్ ఫస్ట్ రియాక్షన్.. తప్పకుండా వినాల్సిందే..
ABN, Publish Date - Oct 18 , 2024 | 05:47 PM
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన లిక్కర్ డబ్బులు సాయంత్రానికి డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేవని, అటువంటి వ్యవస్థను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి కూటమి ప్రభుత్వం మద్యం షాపులు కట్టబెట్టిందని..
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీపై స్పందించారు. ప్రభుత్వ రంగంలో పారదర్శకగా నడుస్తున్న మద్యం దుకాణాలను టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, మాఫియాకు కట్టబెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన లిక్కర్ డబ్బులు సాయంత్రానికి డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేవని, అటువంటి వ్యవస్థను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి కూటమి ప్రభుత్వం మద్యం షాపులు కట్టబెట్టిందని జగన్ ఆరోపించారు. కొత్త లిక్కర్ పాలసీ ముసుగులో ఎన్నో స్కామ్‌లకు పాల్పడేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసిందన్నారు. సీఎం చంద్రబాబు తమ మాఫియాకే కొత్త మద్యం షాపులను కేటాయించారన్నారు. కమీషన్ల కోసమే కొత్త మద్యం విధానాన్ని రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిందని జగన్ విమర్శించారు.
టెండర్లు వేయకుండా..
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధానం మంచిదైతే కిడ్నాప్‌లు ఎందుకు జరిగాయని జగన్ ప్రశ్నించారు. ఎవరైనా టెండర్లు వేయడానికి ప్రయత్నిస్తే పోలీసులే నేరుగా బెదిరించిన ఘటనలు చూశామన్నారు. కూటమి ప్రభుత్వం తమకు తెలిసినవాళ్లకు షాపులు కేటాయించినట్లు జగన్ తెలిపారు. మరో నెల రోజులు పోతే ఎంఆర్‌పి ధరలకంటే ఎక్కువకు మద్యం విక్రయించి, వాటాలు పంచుకుంటారని జగన్ ఆరోపించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 18 , 2024 | 05:47 PM