YS Jagan: ప్రజలు గుణపాఠం నేర్పినా.. బుద్ధి మార్చుకోని వైసీపీ..
ABN, Publish Date - Oct 06 , 2024 | 04:10 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి హామీల అమలు కోసం కనీసం ఏడాది సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఐదేళ్లలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కావాల్సినంత
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఐదేళ్ల జగన్ పాలనకు పది శాతం మార్కులు కూడా వేయలేదు. ప్రజాపాలన మాటున సాగించిన అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇకనైనా వంకర బుద్ధిమార్చుకోవాలని హితవు పలికారు. అయినా కుక్క తోక వంకర అన్నట్లు జగన్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నా ఆయన వ్యవహారశైలిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదట. అధికారంలో ఉండి అరాచకపాలనకు శ్రీకారం చుట్టిన జగన్.. విపక్షంలో ఉండి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై రోజుకో కుట్రకు తెరలేపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి హామీల అమలు కోసం కనీసం ఏడాది సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఐదేళ్లలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కావాల్సినంత సమయం ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఆరు నెలలు కాకుండానే ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ హామీల అమలులో విఫలమైందంటూ ప్రచారం చేస్తోందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో భారీ వరదలు సంభవించి తీవ్ర నష్టం ఏర్పడింది. ఊహించని ఆస్తి నష్టం జరిగింది. వరదలను సమర్థంగా ఎదుర్కోవడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వరదల సమయంలో రాజకీయాలు పక్కనపెట్టి అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా వైసీపీ మాత్రం రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ వరద సహాయక చర్యలను రాష్ట్రప్రజలు మొత్తం మెచ్చుకుంటుంటే వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రజలు గుణపాఠం నేర్పినా వైసీపీ మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదని టీడీపీ, జనసేన నాయకులు విమర్శిస్తున్నారు.
Chittoor: పుంగనూరు బాలిక హత్య కేసు.. ముగ్గురి అరెస్టు.. సంచలన విషయాలు వెల్లడి..
బుద్ధి మారదా..
తిరుమల లడ్డూ వివాదంలో వైసీపీ పూర్తిగా ఇరుక్కోవడంతో ఆ మరకలను చెరుపుకోవడానికి కూటమి ప్రభుత్వంపై కుట్రలకు తెరలేపిందనే చర్చ జరుగుతోంది. ఆరు నెలలు పూర్తికాకుండానే ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ నాయకులతో ప్రచారం చేయిస్తున్నారట. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు ఎంత విచక్షణతో ఆలోచిస్తారనడానికి సార్వత్రిక ఎన్నికలమ ఫలితాలే నిదర్శనం. వై నాట్ 175 నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైసీపీ కనీసం 17 సీట్లను గెలుచుకోలేకపోయింది. ఐదేళ్లపాటు ప్రజలను మోసం చేసిన వైసీపీ.. విపక్షంలోనూ నిర్మాణాత్మక పాత్రను పోషించే ప్రయత్నం చేయడంలేదట. ఎవరైనా వ్యక్తులు, పార్టీలు, సంస్థలు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాయి. కానీ వైసీపీ మాత్రం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ముందుకెళ్తోందని, తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదనే చర్చ నడుస్తోంది.
Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు.. ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు
దూరమవుతున్న నాయకులు..
జగన్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో కొందరు సీనియర్ నేతలు పార్టీ మారుతున్నారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రులు జగన్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అయినప్పటికీ జగన్ తీరులో ఎలాంటి మార్పు కనిపించడంలేదట. జగన్ వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
Minister Kandula Durgesh : జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 06 , 2024 | 04:10 PM