YSRCP: నాడు తిట్లు.. నేడు ప్రశంసలు.. పవన్‌పై వైసీపీ ఎంపీ లవ్
ABN, Publish Date - Dec 06 , 2024 | 01:04 PM
జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగి ఉండటంతో పాటు వయస్సు రీత్యా పవన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా అనే రీతిలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఆరు నెలల క్రితం వరకు పవన్ కళ్యాణ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు అతడి వ్యక్తిగత జీవితంపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులంతా దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరని..
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ విమర్శించిన నోళ్లు.. నేడు ఆయన గొప్ప ఆదర్శవంతమైన నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీలోని ఎన్డీయే నేతల్లో పవన్ కళ్యాణ్ ఆదర్శవంతమైన నాయకుడంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగి ఉండటంతో పాటు వయస్సు రీత్యా పవన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా అనే రీతిలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఆరు నెలల క్రితం వరకు పవన్ కళ్యాణ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు అతడి వ్యక్తిగత జీవితంపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులంతా దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరని విజయసాయిరెడ్డి వంటి వ్యక్తులు విమర్శించడంతో పాటు.. పవన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి స్వరం మారడం వెనుక కారణాలేమిటనే చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ అధ్యక్షులు జగన్‌తో పాటు పార్టీ నేతలంతా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసినప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించలేదనే చర్చ జరుగుతోంది. ఎన్డీయే కూటమిలో చిచ్చుపెట్టేందుకు విజయసాయిరెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారా అనే ప్రచారం సాగుతోంది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం విదేశాలకు రవాణా అవుతున్న విషయాన్ని ప్రజల ముందుంచడంతో పాటు.. ఆ రవాణా వెనుక ఎవరున్నారనే విషయాన్ని తెలియజేయడంతో విజయసాయి పవన్‌పై పాజిటివ్ కామెంట్స్ చేయడం ద్వారా టాపిక్ డైవర్షన్ కోసం ఏమైనా ప్లాన్ చేశారా అనే చర్చ కూడా జరుగుతోంది.
సడన్‌గా పవన్‌పై ప్రేమ..
2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ హేళన చేయడంతో పాటు.. పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తికి రాజకీయాలు ఎందుకంటూ వైసీపీ నేతలు ఎగతాళిగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా, వ్యక్తిగత జీవితంపై దాడిచేసినా పవన్ కళ్యాణ్ ఎక్కడ అదరలేదు, బెదరలేదు. ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారంటూ ప్రజలకు తన స్వరాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు పవన్ కళ్యాణ్ పార్టీకి ఘన విజయాన్ని అందించగా.. జనసేన అధ్యక్షుడిపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన వైసీపీ నాయకులకు గుణపాఠం చెప్పారు. జనసేన పోటీచేసిన ప్రతి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో పవన్ క్రేజ్ ఏమిటో వైసీపీకి అర్థమైందా అంటూ జనసేన నేతలు వ్యాఖ్యానించిన సందర్భాలు చూశాం. చివరకు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనివెనుక ఏదైనా దురుద్దేశం ఉందా.. లేదా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్‌ను విజయసాయిరెడ్డి ప్రశంసించారా అనే విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఒకరిని విమర్శించేందుకు, కూటమిలో చిచ్చు పెట్టే దురుద్దేశంతోనే విజయసాయి జనసేన అధ్యక్షుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారా అనే విషయం తేలాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Dec 06 , 2024 | 03:05 PM