Handful of work : చేతి నిండా పని - చేతికందని మనీ
ABN, Publish Date - Oct 05 , 2024 | 11:35 PM
పరిసరాలు శుభ్రంగా ఉండాలని వేకువనుంచే పనిలోకి వచ్చి వళ్లు వంచి చేతినిండా పనిచేస్తున్నా చేతికి జీతం అందడం లేదు.
రోజంతా కష్టపడినా తీరని వెతలు
ఏడు నెలలుగా అందని జీతాలు
ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికులు
సుండుపల్లె, అక్టోబరు 5: పరిసరాలు శుభ్రంగా ఉండాలని వేకువనుంచే పనిలోకి వచ్చి వళ్లు వంచి చేతినిండా పనిచేస్తున్నా చేతికి జీతం అందడం లేదు. ఒక్కరోజు వారు పనిచేయకపోతే రోడ్లపై నడవలేని పరిస్థితి. వందలాది కుటుంబాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను సేకరించి ఊరి బయటికి తరలిస్తున్నారు. అలాంటి పంచాయతీ కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీలో ఆదాయం వప్తున్నా జీతాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తు న్నారనే ఆరోపణలున్నాయి. వివరాల్లోకెళితే....
వేకువనే పిల్లాపాపలను వదిలేసి విధుల్లోకి హారవుతారు పంచాయతీ కార్మికులు, మన ఊరు బాగుండాలని ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను పోగు చేసి డంపింగ్ యార్డులకు తరలిస్తారు. ఒక్కరోజు పంచాయతీ కార్మికులు పనిచేయకపోతే రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పంచాయతీ కార్మికుల కడుపు నిండడం లేదు. 7 నెలలుగా వారి కి రావాల్సిన జీతాలు ఇవ్వలేదు. రోజూ గొడ్డు కష్టం చేసే కార్మికులకు ఇవ్వడానికి పంచాయతీలో డబ్బు లు లేవా... వస్తున్న ఆదాయం ఏమవుతోందనే ప్రశ్నలు వెల్లువలా వస్తున్నాయి.
పనులు చేస్తే కానీ కడుపు నింపుకోలేని పరిస్థితిలో ఉన్న కార్మికు లకు జీతాలు ఇవ్వకపోవడం హాస్యాస్పదమని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులకు చెప్పినా పంచాయతీలో నిధులు లేవని, ఇస్తామని డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారని కొందరు కార్మి కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంచా యతీ కార్మికులకు సైతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది. పంచాయతీల్లో ఆదాయం ఎంత వస్తోంది, వస్తున్న ఆదాయం ఏమవుతోంద నేది ఐదేళ్లగా ఎవరికీ అంతుచిక్కడంలేదు. సుమారు 4 వేల కుటుంబాలు మండల కేంద్రంలో జీవనం సాగిస్తున్నారు. ఆదాయం ఉంటే ఆ ఆదా యం ఐదు నెలలుగా పంచాయితీ కార్మికులకు జీతం ఇచ్చేందుకు కూడా సరిపోవడం లేదా అని పలువురు చర్చించుకుంటున్నారు. జీతాలు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని పంచాయతీ కార్మికులు అధికారులను వేడుకుంటున్నారు.
జీతాలు ఇవ్వకపోతే ఏం తినాలి
ఏడు నెలలుగా జీతం ఇవ్వడంలేదు. జీతాలు ఇవ్వకపోతే మా కుటుం బం ఏం తిని బతకాలి. రోజూ ప్రజల కోసం ఊరు బాగుండాలని కష్టపడు తు న్నాము. వారానికి ఒకసారి సంతకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలన్నా నాకు స్థోమత లేదు. జీతం ఇచ్చి పుణ్యం కట్టుకోండి.
ఓబులమ్మ, పంచాయతీ కార్మికురాలు
ఎవరికి చెప్పినా ఫలితం లేదు
రోజూ గొడ్డు కష్టం చేస్తు న్నాము. మా కష్టానికి ఫలి తం ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వడం లేదు. కష్టపడి పని చేసే వారిని గుర్తించక పోవడం బాధగా ఉంది. వా రం రోజులు పని చేయక పోతే గ్రామం చెత్తకుప్పలా మారుతుంది. మాకు రావాల్సిన జీతాలు ఇచ్చి మమ్మ ల్ని మా కుటుంబాన్ని ఆదుకోండి.
రమణయ్య, పంచాయతీ కార్మికుడు
Updated Date - Oct 05 , 2024 | 11:35 PM