ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:45 PM

హరిరామ జోగయ్య.. కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు.. ఏపీ ఎన్నికలకు ముందు ఈయన పేరు పదే పదే వినిపించేది. ఊ అంటే ఆ అంటే పేపరు పట్టుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖలు రాసేవారు.

ఏలూరు: హరిరామ జోగయ్య.. కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు.. ఏపీ ఎన్నికలకు ముందు ఈయన పేరు పదే పదే వినిపించేది. ఊ అంటే ఆ అంటే పేపరు పట్టుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖలు రాసేవారు. పవన్‌ను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకునేవారు. ఇవన్నీ ఎవరు రాయించారనేది జనమందరికీ తెలిసిందే. అయితే కూటమి ఎన్నికల్లో గెలిచాక మాత్రం హరి రామ జోగయ్య సైలెంట్ అయ్యారు. ఒకరకంగా ఆయన చేత లేఖలు రాయించిన వారు సైలెంట్ అవడంతో ఆయన కూడా కామ్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాస్త ఊపు వచ్చినట్టుంది. తిరిగి పెన్నూ.. పేపర్ అందుకున్నారు. ఈసారి పవన్‌ను మాత్రమే కాదండోయ్.. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిపే లేఖ రాశారు. ఎందుకంటారా? ఉండనే ఉందిగా కాపు రిజర్వేషన్ అంశం. ఎప్పుడూ దీనిని రావణ కాష్టంలా మండించేందుకు యత్నిస్తూనే ఉంటారు.


కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారన్నారు. కాపులకు రిజర్వేషన్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేన అనేక ఉద్యమాలు చేసిందని హరిరామ జోగయ్య తెలిపారు.


ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర న్యాయస్థానంలో పిటిషన్ సైతం వేసిందన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వైసీపీ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త ఆఫిడివిట్ దాఖలు చేయాలని కోరుతున్నామని హరిరామ జోగయ్య తెలిపారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి...

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 12:45 PM

Advertising
Advertising
<