AP Govt: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ..
ABN, Publish Date - Jul 01 , 2024 | 06:18 PM
ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్అధికారులను వారి మాతృశాఖలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న కె.ఈశ్వర్ రెడ్డిని మంగళగిరి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను వారి మాతృశాఖలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న కె.ఈశ్వర్ రెడ్డిని మంగళగిరి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ ఎన్.పూజితను కడప, అనంతపురం అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తూ డీజీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. విజయవాడ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ కరీముల్లా షరీఫ్‌కు తిరుపతి, కర్నూలు రీజినల్ అండ్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ కె.ఈశ్వర్ రావుకు అనంతపురం రీజినల్ అండ్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి:
AP Politics: టీడీపీ ఆఫీసుకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. ఎందుకంటే?
Updated Date - Jul 01 , 2024 | 06:21 PM