ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సత్యకుమార్‌ సామెతపై మండలిలో దుమారం

ABN, Publish Date - Nov 22 , 2024 | 05:48 AM

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మెడికల్‌ కళాశాలల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మండలిలో విమర్శించారు.

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మెడికల్‌ కళాశాలల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మండలిలో విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ.198 కోట్లను దారి మళ్లించిందన్నారు. వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.8,400 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉండగా రూ.1,400 కోట్లే ఖర్చు చేసిందన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పిన సామెత సభలో దుమారం రేపింది. ఇది ఓ మతం వారిని కించపరిచేలా ఉందని.. మంత్రి క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ ‘తన సామెత ఏ కులాన్నీ, ఏ మతాన్నీ అవమానించేలా, మనోభావాలను దెబ్బతీసేదిగా లేదని, ఒకవేళ ఉన్నట్లు భావిస్తే.. వెనక్కి తీసుకుంటున్నాను’ అన్నారు. చైర్మన్‌ మోషేన్‌రాజు ‘ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలి’ అని ఆదేశించారు.

Updated Date - Nov 22 , 2024 | 05:48 AM