ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద

ABN, Publish Date - Aug 03 , 2024 | 08:23 AM

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తూనే ఉంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో : 4,54,710 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 5,16,501 క్యూసెక్కులుగా ఉంది.

నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తూనే ఉంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో : 4,54,710 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 5,16,501 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 883.800 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 204.7888 టీఎంసీలుగా ఉంది. కుడి ,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో : 4,19,588 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 34,088 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 558.60 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.50 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 229.13 టీఎంసీలకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద భారీగా తగ్గిపోయింది. స్పిల్ వే ఎగువన 31.290, దిగువన 22.595 మీటర్ల నీటి మట్టం చేరుకుంది. గోదావరి దిగువకు 7 లక్షల 16 వేల 051 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది.


రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయింది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 9.30.అడుగులకు తగ్గింది. 6.74 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేరింది. వరద ముంపు నుంచి లంక గ్రామాలు బయటపడ్డాయి. వరద ముంపునకు పంటలన్నీ కుళ్లిపోయాయి. పంట నష్టాన్ని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వరద నష్టం సంభవించింది.

Updated Date - Aug 03 , 2024 | 08:23 AM

Advertising
Advertising
<