మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mega DSC: మెగా డీఎస్సీ పూర్తి వివరాలు వచ్చేశాయ్

ABN, Publish Date - Jun 13 , 2024 | 09:16 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిసిరింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి.

Mega DSC: మెగా డీఎస్సీ పూర్తి వివరాలు వచ్చేశాయ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిసిరింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి.

మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు

మొత్తం పోస్టులు- 16347

స్కూల్ అసిస్టెంట్ - 7,725

ఎస్‌జీటీ - 6371

టీజీటీ - 1781

పీజీటీ - 286

ప్రిన్సిపల్స్ - 52

పీఈటీ - 132


అవనిగడ్డలో చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం

అవనిగడ్డలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు డీఎస్సీ ఆశావహులు పాలాభిషేకం నిర్వహించారు. మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అవనిగడ్డలో శిక్షణ పొందుతున్న డీఎస్సీ ఆశావహుల ఆద్వర్యంలో పాలాభిషేకం గురువారం పాలాభిషేక కార్యక్రమం జరిగింది. డీఎస్సీ అభ్యర్థులు నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. నిరుద్యోగులు ఐదేళ్లపాటు తమ విలువైన సమయాన్ని కొల్పోయారని ఆయన అన్నారు. అభ్యర్థుల కష్టాన్ని చూసి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ నెరవేచుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 09:23 PM

Advertising
Advertising