ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేంటి?

ABN, Publish Date - Nov 14 , 2024 | 05:16 AM

సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు నమోదు చేస్తున్న కేసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.

న్యాయమూర్తులు కూడా బాధితులే

కేసుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు నమోదు చేస్తున్న కేసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించింది. ఒక దశలో తమను కూడా ఉపేక్షించలేదని, అసభ్యకర పోస్టులకు న్యాయమూర్తులూ బాధితులుగా మారారని గుర్తు చేసింది. పోలీసు కేసుల్లో ఏరకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నేరానికి పాల్పడిన వ్యక్తుల విషయంలో పోలీసులు చట్టనిబంధనల మేరకు నడుచుకుంటుంటే తాము ఎలా నిలువరించగలమని ప్రశ్నించింది. పోలీసులు నమోదు చేసిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులకు క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేసుకొనే ప్రత్యామ్నాయ మార్గం ఉందని గుర్తుచేసింది. కేసుల నమోదుపై పిల్‌ దాఖలు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుత పిల్‌పై తగిన నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కేసులు పెడుతూ పోలీసులు చట్టనిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, పోలీసుల చర్యలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు, వైసీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు పోలా విజయ్‌బాబు పిల్‌ దాఖలుచేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. పోలీసుల చర్య సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా ఉందని వాదించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సామాజిక మాధ్యమాలలో 2000 మంది అసభ్యకర, అనుచిత పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాంటివారిపై కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులు కూడా ఈ దూషణలకు బాధితులుగా మారారని గుర్తు చేసింది.

‘‘సామాజిక మాధ్యమంలో ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు, పోస్టులు పెడతామంటే కుదరదు. తాము ఏమైనా చేస్తామనే భావనలో ఉన్నవారిని పోలీసులు చట్టం ముందు నిలబెట్టడం తప్పెలా అవుతుంది? సామాజిక మాధ్యమాల వేదికగా 2వేల మంది అసభ్యకర, అనుచిత పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటే, అలాంటివారిని గుర్తించి చట్టం ముందుకు తీసుకురావడంలో తప్పేముంది? ఈ తరహా పోస్టుల విషయంలో కేసులు నమోదు చేయకుండా పోలీసులను నిలువరిస్తూ బ్లాంకెట్‌ ఆర్డర్‌ (సార్వత్రిక ఉత్తర్వులు) ఇవ్వలేం?’’

- హైకోర్టు

Updated Date - Nov 14 , 2024 | 05:16 AM