Andhra Pradesh: తిరుమలలో విరిగిపడ్డ కొండ చర్యలు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:24 PM
తిరుమలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మట్టి, బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. రెండో ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తిరుమలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మట్టి, బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. రెండో ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అటు వైపు వెళ్లే ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఫెంగల్ తుఫాన్ ప్రభావం..
చిత్తూరు జిల్లాపై ఫెంగల్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫెంగల్ దెబ్బతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు పలు రోడ్డు దెబ్బతిన్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి, టమాటా, అరటి, కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 1500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.దాదాపు 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కల్లాల్లో వరి పంట తడిసి మొలకెత్తుతోన్న పరిస్థితి ఏర్పడింది. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - Dec 03 , 2024 | 01:33 PM