ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nandyala: భారీ మోసం.. రూ. 40 కోట్లతో జంప్

ABN, Publish Date - Nov 29 , 2024 | 08:05 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రామాంజనేయులు అనే వ్యక్తి మాటలు విని దాదాపు 200 మంది ప్రజలు నిలువునా మోసపోయారు. దాదాపు రూ. 40 కోట్ల అతడికి చెల్లించారు. ఆ నగదు తీసుకుని అతడు ఊడాయించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

నంద్యాల, నవంబర్ 29: ప్రజలను నట్టేట ముంచేందుకు పలు సంస్థలు, వివిధ యాప్‌లు పట్టుగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. వాటి మాయలో పడి ప్రజలు మోసపోతునే ఉన్నారు. అయినా అవి పుట్టుకు రావడం మాన లేదు.. వాటి మాయలో ప్రజలు పడడం ఆగ లేదు. అలా మాయలో పడి దాదాపు 200 మంది ప్రజలు బాధితులుగా మారిన ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలోని డోన్‌లో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

Also Read: జనవరి నుంచీ రాజధానిలో పనులు ప్రారంభం

Also Read: మినపప్పు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


డోన్ పట్టణానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి.. కేవ ఇండస్ట్రీస్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాడు. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ స్థానికులకు ఆశ చూపాడు. దీంతో భారీగా ప్రజలు రామాంజనేయులు మాటలు నమ్మారు. ఆ క్రమంలో భారీగా నగదు అతడికి ముట్ట జెప్పారు. భారీగా లాభాలు వస్తాయనే ఆశతో అప్పులు చేసి, స్థలాలు విక్రయించి.. భారీగా నగదు అతడి చేతిలో పొశారు.

Also Read: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Also Read: భారీ వర్షాలు.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్


అయితే గత కొంత కాలంగా రామాంజనేయులు ఫోన్ ఎత్తడం మానేశాడు. దీంతో అనుమానించిన ప్రజలు.. అతడి కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. ఆ కార్యాలయానికి తాళం దర్శనమిచ్చింది. దీంతో తాము నిలువునా మోసపోయామని బాధితులు గ్రహించారు. దాంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

Also Read: కేసీఆర్ దీక్ష ఫేక్.. విచారణ జరపాలి

Also Read: విజన్‌ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష


పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు 200 మంది బాధితులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దాదాపు రూ. 40 కోట్ల మేర రామాజంనేయులు వద్ద బాధితులు పెట్టుబడిగా పెట్టారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

For AndhraPradesh news And Telugu news

Updated Date - Nov 29 , 2024 | 08:21 PM