తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తివీరంగం
ABN, Publish Date - Oct 20 , 2024 | 05:10 AM
తిరుమలలో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి చేయి కోసుకుని వీరంగం సృష్టించాడు.
లేపాక్షి సర్కిల్లో చేయి కోసుకున్న నెల్లూరువాసి
తిరుమల, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి చేయి కోసుకుని వీరంగం సృష్టించాడు. భక్తుల రద్దీ అఽధికంగా ఉండే లేపాక్షి సర్కిల్లో పెద్దగా కేకలు వేస్తూ కత్తితో చేతిపై పలుమార్లు కోసుకుంటూ హల్చల్ చేశాడు. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన రేవంత్(23) శనివారం ఉదయం లేపాక్షి సర్కిల్ వద్దకు వచ్చాడు. ఒక్కసారిగా పెద్దగా కేకలు వేస్తూ ఎడమచేతిపై కత్తితో కోసుకున్నాడు. అతన్ని గమనించిన సమీపంలోని భక్తులు భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. కొంత సమయానికి విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని రేవంత్‌కు నచ్చజెప్పి చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 108 అంబులెన్స్‌లో తిరుమలలో అశ్విని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - Oct 20 , 2024 | 05:10 AM