ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలల పనివేళలు పెంపు!

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:24 AM

రాష్ట్రంలో పాఠశాలల పనివేళ లు పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.

నెల్లూరు జిల్లాలో పైలట్‌గా కొత్త టైమ్‌టేబుల్‌

సాయంత్రం గంట అదనంగా బడి

పైలట్‌ అనంతరం తుది నిర్ణయం

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలల పనివేళ లు పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త టైమ్‌టేబుల్‌ను నెల్లూరు జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలుచేయాలని నిర్ణయించింది. తాజాగా ఆ జిల్లా డీఈవో దీనిపై ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాల లేదా హైస్కూల్‌ ప్లస్‌ ను ఎంపిక చేసి ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైమ్‌టేబుల్‌ అమలుచేయాలని పేర్కొన్నారు. దానిపై వచ్చే అభిప్రాయాలతో నివేదికలు సమర్పించాలన్నారు. ఆ నివేదికల ఆధారంగా రాష్ట్రవ్యాప్త అమలుపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్ర 4 గంటలు కాగా..కొత్త టైమ్‌టేబుల్‌ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయి. ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్‌ల సమయం 5 నిమిషాల చొప్పున, భోజన విరామం 15 నిమిషాలు పెంచారు. ఉదయం మొదటి పీరియడ్‌ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. ఆ తర్వాత 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచారు. మధ్యాహ్నం మొదటి పీరియడ్‌ను మార్చకుండా అనంతరం 3 పీరియడ్లు 45 నిమిషాలకు పెంచారు. ఈ మార్పుల కారణంగా రోజులో బడి సమయం గంట పెరుగనుంది. అయితే కొత్త పనివేళలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) అధ్యక్షుడు ఎస్‌.బాలాజీ, ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ ప్రస్తుత పనివేళలనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 18 , 2024 | 04:26 AM