ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి

ABN, Publish Date - Jul 14 , 2024 | 09:13 PM

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సంబంధాన్ని అంటగడుతూ మాజీ భర్త మదన్ చేసిన ఆరోపణలపై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి స్పందించారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సంబంధాన్ని అంటగడుతూ మాజీ భర్త మదన్ చేసిన ఆరోపణలపై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి స్పందించారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక ఎంపీగా మాత్రమే విజయసాయిరెడ్డితో తనకు పరిచయమని, ఒక అధికారిగా మాత్రమే తాను ఆయనతో మాట్లాడానని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.


‘‘నా వ్యక్తిగత జీవితాన్ని రోడ్డున పెట్టడానికి మీరెవరు?. ఒక గిరిజనురాలు మంచి బట్టలు వేసుకోవడం మీ దృష్టిలో తప్పా?. గెజిటెడ్ ఆఫీసర్‌గా ఉన్న నేను మంచిగా ఉంటే తప్పా?. నా క్యారెక్టర్‌పై మచ్చ వేయడానికి మదన్ మోహన్‌కు సిగ్గులేదాఝ?. 2016లో విడాకులు తీసుకున్నప్పుడు పిల్లలతో సహా అన్నీ పంచుకున్నాం. మేం ఇద్దరం చెరొక బిడ్డను చూసుకోవాలని రాసుకున్నాం. మదన్ మోహన్ క్రిస్టియన్. నేను పుట్టుకతోనే హిందువును. క్రిస్టియన్‌గా నన్ను మారమని చాలా ఒత్తిడి తెచ్చాడు. నాకు పుట్టిన బాబును చంపేయాలని బెదిరించాడు. నేను ప్రస్తుతం సుభాష్‌తోనే (ప్రస్తుత భర్త) ఉన్నాను. ఈ ఏడాది ఏప్రిల్‌లో మ్యూచువల్ డైవర్స్‌కు మదన్ మోహన్, నేను దరఖాస్తు చేసుకున్నాం. పిల్లల కోసం ఒక ఎంవోయూ కూడా చేసుకున్నాం’’ అని అన్నారు.


‘‘మదన్ మోహన్‌తో 2013 నవంబర్‌లో పెళ్లైంది. 2015 ఏప్రిల్‌లో కవలలు పుట్టారు. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్‌కు ఇంటర్యూకి వెళ్లాం. మదన్ సెలక్టయ్యాడు. నేను సెలక్ట్ కాలేదు. మదన్ నన్ను చిత్రహింసలకు గురిచేసేవాడు. 2016లో నాకు విడాకులిచ్చారు. విడాకులిచ్చినప్పటికీ పిల్లల కోసం వచ్చేవాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. నా మొదటి పోస్టింగ్ విశాఖలో వేశారు. ఓ అధికారి వేధిస్తే నాకు సుభాష్ అండగా నిలిచాడు. సుభాష్‌తో ఇష్టపూర్వకంగానే నా పెళ్లి (రెండో పెళ్లి) జరిగింది. నేనొకరి భార్యనని తెలిసి కూడా మదన్ నన్ను వేధించాడు. పిల్లలు,ఆస్తి విషయంలో డాక్యుమెంట్ రాసుకున్నాం. రూ.30 కోట్లు ఇవ్వాలని నన్ను మదన్ వేధిస్తున్నాడు. అసిస్టెంట్ కమిషనర్‌గా నా నెల జీతం రూ.58 వేలు’’ అని అన్నారు.


గిరిజన మహిళను కాబట్టే వేధిస్తున్నారు

‘‘నేనొక గిరిజన మహిళను కాబట్టే నన్ను వేధిస్తున్నారు. వేరే కులానికి చెందిన మహిళను అయితే అలా చేయగలరా?. ప్రేమ సమాజం స్థలానికి సాయిప్రియా రిసార్ట్స్ చాలా తక్కువ ధరకే లీజు సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ విషయం తెలిసి నేను ఇన్ఫెక్షన్‌కు వెళ్లాను. నేను మరొకరికి భార్యను అని తెలిసి కూడా మదన్ నన్ను ఇబ్బంది పెట్టాడు. లైంగికంగా నన్ను వేధించాడు. కడుపుతో ఉన్నప్పుడు నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడు. విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడానికి సిగ్గులేదా?. అయన వయసుకు అయినా గౌరవం ఇవ్వరా?. నేను చస్తే నాపై ఆరోపణలు చేసిన వారే నా చావుకు కారణం అవుతారు. ఒక ఆడపిల్లను ఇలా వేధించడం మీకు భావ్యమేనా?’’ అని కే.శాంతి ప్రశ్నించారు.

Updated Date - Jul 14 , 2024 | 09:13 PM

Advertising
Advertising
<