ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అదంతా దుష్ప్రచారమే!

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:22 AM

అమ్మాయిలను వలలో వేసుకుని వారితో న్యూడ్‌ కాల్స్‌ రికార్డు చేసే ఇంజనీరింగ్‌ విద్యార్థి ఒకడు... ప్రియుడితో హోటల్‌ గదులకు వెళ్లే ప్రియురాలు మరొకరు..

Engineering College In Krishna District

హాస్టల్‌ స్నానపు గదుల్లో రహస్య కెమెరాల్లేవు నలుగురు విద్యార్థుల తీరుతో వివాదం

తన నగ్న వీడియోలు బయటకు రాకూడదనే..

అందరి వీడియోలూ ఉన్నాయని బెదిరించిన యువతి

బాత్‌రూముల్లో రహస్య కెమెరాలు పెట్టారని వెల్లడి

విద్యార్థినులు ఆరా తీసే క్రమంలో వివాదం వెలుగులోకి

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ వివాదంలో

వాస్తవాలు వెలికి తీస్తున్న ముగ్గురు ఐజీల బృందం

వైఫై రూటర్లను విశ్లేషిస్తున్న సెర్ట్‌, సీడాక్‌ నిపుణులు


అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అమ్మాయిలను వలలో వేసుకుని వారితో న్యూడ్‌ కాల్స్‌ రికార్డు చేసే ఇంజనీరింగ్‌ విద్యార్థి ఒకడు... ప్రియుడితో హోటల్‌ గదులకు వెళ్లే ప్రియురాలు మరొకరు.. ఆమె వన్‌సైడ్‌ ప్రేమికుడు ఇంకొకరు... చెల్లిని మోసం చేసిన స్నేహితుడి అంతు చూడాలనుకున్న విద్యార్థి మరొకరు... ఇలా ఈ నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి రావు ఇంజనీరింగ్‌ కాలేజీలో వివాదానికి కారణమని నిపుణులు, పోలీసులు దాదాపు ఒక నిర్దారణకు వచ్చారు..! ఒక అమ్మాయి హిడెన్‌ కెమెరాలతో హాస్టల్‌ విద్యార్థినుల నగ్న వీడియోలు రికార్డు చేసి హాస్టల్‌లోని అబ్బాయిలకు విక్రయిస్తున్నట్లు పుట్టించిన వార్తల్లో నిజాలు నిగ్గుతేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముగ్గురు ఐజీలు జీవీజీ అశోక్‌కుమార్‌ , పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం. రవిప్రకాశ్‌తో కూడిన బృందాన్ని రంగంలోకి దించింది.


అణువణువూ క్షుణ్ణంగా పరిశీలన

స్థానిక ఐజీ అశోక్‌కుమార్‌కు సీఐడీ, ఏసీబీలో పనిచేసిన అనుభవం ఉంది. ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన పీహెచ్‌డీ రామకృష్ణ.. టెక్నాలజీలో దిట్ట. మరో ఐజీ రవిప్రకాశ్‌తో కూడిన బృందం అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేసి నిజానిజాలు నిగ్గు తేలుస్తోంది. దేశంలోనే ప్రతిష్టాత్మక టెక్నికల్‌ సంస్థ సెర్ట్‌ (కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌) డైరెక్టర్‌ సంజయ్‌ బాహ్ల్‌ నేరుగా రంగంలోకి దిగారు. పుణెలోని సీ-డాక్‌ నుంచి నిపుణుల బృందం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీకి చేరుకుని విద్యార్థి సంఘాల నేతలు, కళాశాల సిబ్బంది సమక్షంలో హాస్టల్‌ స్నానాల గదుల్లోని ఎలక్టికల్‌, ప్లంబింగ్‌ పరికరాలన్నీ ఎలక్ర్టానిక్‌ డిటెక్టర్లతో పరిశీలించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోపాటు మరో ఇద్దరు అబ్బాయిల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు హాస్టల్‌లోని వై-ఫై రూటర్లను సెర్ట్‌ విశ్లేషణ చేస్తోంది. ఎక్కడ రహస్య కెమెరా పెట్టినా వై-ఫై ద్వారా నెట్‌ వాడి వాటిని బయటికి ట్రాన్స్‌మిట్‌ చేయాలి. ఒకవేళ మొబైల్‌ ఫోన్ల హాట్‌స్పాట్‌ తీసుకున్నా ఎవరెవరు హాట్‌స్పాట్‌ ఎవరికి ఇచ్చారనేది కూడా తేల్చేపనిలో సెర్ట్‌, సీ-డాక్‌ బృందం నిమగ్నమైంది. కాగా, ఇప్పటి వరకూ జరిగిన ప్రచారంలో నిజాల్లేవని నిపుణులు, పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కేవలం నలుగురు విద్యార్థుల వివాదమే ఇంతటి వివాదానికి కారణంగా పోలీసు ఉన్నతాధికారులు పసిగట్టినట్లు సమాచారం.


ఆ విషయం బయటకు రాకూడదనే..

ప్రేమ పేరుతో అమ్మాయిలను వలలో వేసుకునే విజయ్‌ అనే విద్యార్థికి అదే కళాశాలలో మరో విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేసుకోవడం వారికి రోజూ అలవాటే. అయితే ప్రియురాలికి తెలియకుండా విజయ్‌ వాటిని రికార్డు చేస్తుండేవాడు. విజయ్‌ స్నేహితుడు ఒకరోజు ఫోన్‌ చూస్తుండగా అందులో అమ్మాయిల నగ్న వీడియోలు కనిపించాయి. వెంటనే విజయ్‌ ప్రేమికురాలి మరో స్నేహితుడికి ఈ విషయాన్ని చేరవేశాడు. ఆమెను ఏకపక్షంగా ప్రేమిస్తున్న ఆ విద్యార్థి ఇదేమిటని ప్రశ్నించడంతో ఆమె విజయ్‌ని నిలదీసింది. తన స్నేహితుడే దీనికి కారణమని తెలుసుకున్న విజయ్‌ ఓరేయ్‌.. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ చెల్లిని లైన్లో పెట్టా.. ఆమె వీడియోలు కూడా ఉన్నాయి. కాలేజీలో అందరికీ పంపుతా అని బెదిరించాడు. దీంతో విజయ్‌ స్నేహితుడు వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్‌ పిలిచి విచారించగా ఏడెనిమిది ఫొటోలు బయటికి వచ్చాయి. అందరినీ హెచ్చరించి వివాదాన్ని మూసేశారు. ఇటీవల అదే యువతితో విజయ్‌ ఉన్న మరో వీడియో వెలుగులోకి రావడంతో ఆమె స్నేహితురాళ్లు ఇదేమిటని అడిగారు.


ఇది విషయం..

అసలు విషయం చెప్పడం ఇష్టం లేని విజయ్‌ ప్రియురాలు.. నావే కాదు.. మీవి కూడా ఉన్నాయ్‌.. మీ వాష్‌ రూమ్‌ల్లో నేనే స్పై కెమెరాలు పెట్టి రికార్డు చేశా.. అని బదులిచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హాస్టల్‌ విద్యార్థినిలు ఒకరికొకరు ఆరా తీసే క్రమంలో విషయం కళాశాల బయటికి వచ్చింది. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన ఐజీలు.. ఎవ్వరిని అడిగినా వీడియోల్లేవని చెప్పారు. రహస్య కెమెరాల ప్రచారం ఎలా వ్యాప్తి చెందిందని ఆరా తీయగా.. విజయ్‌ ప్రియురాలే చెప్పిందని బదులిచ్చారు. ఆమెను ప్రశ్నింగా విజయ్‌తో కలిసి ఉన్న నా వీడియో గురించి అందరూ అడగడంతో మీవి కూడా ఉన్నాయని బెదిరిస్తే.. వారు ఎక్కడా బయటకు చెప్పరనే ఉద్దేశంతోనే అలా చెప్పాను అని బదులిచ్చింది. మొత్తం విచారణ తర్వాత కళాశాలలోని వై-ఫై రూటర్లన్నీ సెర్ట్‌, సీ-డాక్‌ నిపుణుల బృందంతో విశ్లేషణ చేయిస్తున్నారు. అందులోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. పోలీసు శాఖ మరో రెండు మూడు రోజుల్లో మొత్తం నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.

Updated Date - Sep 04 , 2024 | 09:36 AM

Advertising
Advertising