ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Lokesh-Sankharavam: జగన్ మోహన్ రెడ్డీ... పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తాం... కాసుకో: అచ్చెన్నాయుడు

ABN, Publish Date - Feb 11 , 2024 | 08:01 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్న ‘టెక్కలి శంఖారావం సభ’లో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ జగన్ మోహన్ రెడ్డీ... పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తాం... కాసుకో’’ అంటూ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో నాయకత్వం వహించగల దమ్మున్న నేత నారా లోకేశ్ అని ఈ సందర్భంగా అన్నారు.

శ్రీకాకుళం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్న ‘టెక్కలి శంఖారావం సభ’లో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ జగన్ మోహన్ రెడ్డీ... పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తాం... కాసుకో’’ అంటూ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో నాయకత్వం వహించగల దమ్మున్న నేత నారా లోకేశ్ అని ఈ సందర్భంగా అన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో వేల మంది కార్యకర్తలు శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చారని ప్రస్తావించారు. ‘‘నా చివరి శ్వాస వరకు టెక్కలి ప్రజలు, ప్రజాసేవకే అంకితమవుతా’’ అని పునరుద్ఘాటించారు.

అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన టెక్కలికి తాను ఎమ్మెల్యే కావడం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కావడం తన అదృష్టమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ‘‘ మీ అందరి సహకారంతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అధికారమంటే ప్రజలకు సేవచేయడం, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం అని భావించాను. చీమకు కూడా హాని తలపెట్టకుండా సేవలు అందించాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులను చూశాను. 2019లో ఏపీ ప్రజలు దగా పడ్డారు. ఒక్క అవకాశం పేరుతో ఒక దుర్మార్గుడిని రాష్ట్రప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజలు చేసిన తప్పిదమే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు దోచి, 16నెలలు జైలులో ఉన్న దొంగకు ఓటేయడం ప్రజలు చేసిన తప్పే. మన పార్టీ లేకుండా చేయాలని తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేశారు. జైలులో పెడితే పారిపోతామనుకున్నారు. తెలుగుదేశం పార్టీ గాలికి పుట్టలేదు, పేదవాడి ఆకలి కేకల నుంచి పుట్టింది’’ అని అన్నారు.


‘‘ఈ రోజు చెబుతున్నా... రాష్ట్రంలోని 175 స్థానాలను రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది. ఐదేళ్లు రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడికి ప్రజలు ఏవిధంగా ఓట్లు వేస్తారు? సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. బటన్ నొక్కి రూ.2.5 లక్షల కోట్లు పేదలకు ఇచ్చానంటున్న జగన్... అప్పుగా తెచ్చిన రూ.12 లక్షల కోట్లు ఏం చేశాడు?. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాననే బెంగతో నేను పేదవాడినంటూ కొత్తరాగం అందుకున్నాడు. సాక్షి పేపర్, టీవీ, బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్‌లు ఎవరివి?. రూ.500 కోట్లతో రుషికొండలో కట్టిన ప్యాలెస్ ఎవరిది?. రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు మరోమారు మోసపోయి ఓట్లు వేస్తారనుకున్నాడు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు జగన్‌కు కర్రు కాల్చి వాతపెట్టారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34స్థానాలను కలుపుకుని టీడీపీ-జనసేన కలిసి 160 స్థానాలు గెలుస్తాయి. 2014-19 మధ్యాకాలంలో టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణయుగం, ఎవరూ చేయనంత సంక్షేమం చేశాను. అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసినా ప్రజల కష్టాలు విన్నాను. ఈ రోజు నుంచి 60 రోజులు టెక్కలి కార్యకర్తలు కష్టపడండి. 50 వేల మెజారిటీతో టీడీపీని గెలిపించండి’’ అని అచ్చెన్నాయుడు కోరారు.

‘‘ రాబోయే ప్రభుత్వంలో లోకేశ్ కీలకపాత్ర పోషిస్తారు. ఆయన సహకారంతో టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తాను. టెక్కలిలో ఇంకా 2 పనులు చేయాల్సి ఉంది. ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీటిని అందించాలి. జిల్లాకు వంశధార జీవనాడి, టీడీపీ హయాంలో 72 శాతం పూర్తి చేశాం. వైసీపీ వచ్చాక తట్టమట్టి తీయలేదు, వంశధార కాల్వలన్నీ పూడిపోయాయి. ఐదేళ్లుగా ప్రతిరైతు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హీరమండలం నుంచి వజ్జపుకొత్తూరు, మర్రిపాలెం వరకు కాల్వలు తవ్వించాల్సి ఉంది. వెయ్యి కోట్ల రూపాయలు అయినా ఈ పనులు పూర్తిచేయాలి. మన ప్రభుత్వం వచ్చాక కాల్వల లైనింగ్ చేసి నీరు అందించేందుకు సహకరించండి. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకున్నాం. లోకేష్ కూడా రెడ్‌బుక్‌లో రాశారు. 6 మాసాల్లో చక్రవడ్డీతో సెటిల్‌మెంట్ చేస్తాం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 08:01 PM

Advertising
Advertising