ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Solar Power : వద్దంటే విన్నారా!?

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:21 AM

అడ్డగోలు ఒప్పందానికి... అర్థంలేని సమర్థన! పైగా... శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి అనే డిమాండ్లు!

సొంత ఆర్థిక శాఖ సూచనలూ బుట్టదాఖలు

అయినా.. అలవోకగా జగన్‌ అబద్ధాల ప్రవాహం

‘అదానీ’ నుంచి సౌర విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన కేబినెట్‌ నోట్‌ ఫైల్‌పై తన ప్రభుత్వంలోని విద్యుత్తు శాఖ మంత్రే సంతకం చేసేందుకు ససేమిరా అన్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా వచ్చిన ఫైలుపై సంతకం చేసేది లేదన్నారు! అన్ని చార్జీలూ కలిపినా యూనిట్‌ ధర రూ.2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సిఫారసు చేసింది. అయితే.. నాటి సీఎం జగన్‌ సంబంధిత మంత్రి స్పందనను పట్టించుకోలేదు. ఆర్థిక శాఖ సూచనలూ వినిపించుకోలేదు. ‘అదానీ’ కోసం అడ్డగోలుగా ముందుకెళ్లారు. ఇప్పుడేమో.. సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి అంటున్నారు!

యూనిట్‌ రూ.2.49 దాటొద్దని స్పష్టీకరణ

తక్కువ ధరే ప్రామాణికంగా

తీసుకోవాలని విస్పష్ట సూచన

ప్రాజెక్టు ఆలస్యంపైనా అప్పుడే జాగ్రత్తలు

అయినా పట్టించుకోని జగన్‌ సర్కారు

ఆర్థిక శాఖ సిఫారసులు ‘తోసిపుచ్చిన’ కేబినెట్‌

అన్ని చార్జీలూ కలిపితే యూనిట్‌ రూ.5పైనే

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

డ్డగోలు ఒప్పందానికి... అర్థంలేని సమర్థన! పైగా... శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి అనే డిమాండ్లు! ‘సెకీ’తో సౌర విద్యుత్తు ఒప్పందంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీరిది! అమెరికాలో పెట్టిన కేసులో తన పేరే లేదని దబాయింపు... అంతర్‌రాష్ట్ర రవాణా చార్జీలు (ఐఎ్‌సటీసీ) లేవని బుకాయింపు! ఒప్పందం అక్రమమైతే ‘ఆంధ్రజ్యోతి’ ఆనాడే తప్పు పట్టేది కదా అని కూడా జగన్‌ ప్రశ్నించారు. ఎవరి సంగతో ఎందుకు! ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక శాఖే పరోక్షంగా తప్పుబట్టింది. అనేక జాగ్రత్తలు చెప్పింది. సూచనలు చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా... అన్ని రకాల పన్నులు, చార్జీలు, సుంకాలు కలిపి యూనిట్‌ సోలార్‌ విద్యుత్తు రూ.2.49 దాటొద్దని స్పష్టంగా చెప్పింది. కానీ... నాటి సీఎం జగన్‌ వింటేనా! ‘ఆదానీయే నాకు ముఖ్యం’ అంటూ తన సొంత ఆర్థిక శాఖ సూచనలను సైతం బేఖాతరు చేశారు.

ఇదీ చెప్పింది...

సెకీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందానికి ముందు నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖతో కూడా ఇంధన శాఖ సంప్రదింపులు జరిపింది. దీనిపై నాటి ఆర్థిక శాఖ అనేక సూచనలు చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా ‘‘అన్ని పన్నులు, సుంకాలు కలిపి యూనిట్‌ విద్యుత్తు ధర రూ.2.49 ఉండాలి’’ అని ఇంధన శాఖకు సూచించింది. 2021 అక్టోబరు 28వ తేదీన ‘సెకీ’తో ఒప్పందాన్ని జగన్‌ మంత్రివర్గం ఆమోదించింది. ఆ రోజు ‘ఐటమ్‌ నంబర్‌ 15’గా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. ‘ఆర్థిక శాఖ సూచనలను తిరస్కరిస్తున్నాం’ అని అందులో స్పష్టం చేశారు.


అయినా... అబద్ధాలే!

అదానీ కోసం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అంతర్‌రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు లేనే లేవని జగన్‌ గురువారం అలవోకగా అబద్ధాలు చెప్పారు. పదేపదే అదే మాట నొక్కి వక్కాణించారు. నిజానికి... ఈ విద్యుత్తుకు నెట్‌వర్క్‌ చార్జీలు వర్తిస్తాయని అప్పట్లోనే ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. యూనిట్‌ విద్యుత్తు ధర రూ.2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సూచించగా... ‘నెట్‌వర్క్‌ చార్జీలు అదనం’ అని ఆయన తేల్చేశారు. ఎక్కడో రాజస్థాన్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్తును ఏపీకి గ్రిడ్‌ ద్వారా సరఫరా చేసేందుకు చార్జీలు చెల్లించాల్సిందే! ఇలా అన్ని రుసుములు, చార్జీలు కలిపితే... ‘సెకీ’ నుంచి కొనుగోలు చేసే సౌర విద్యుత్తు యూనిట్‌కు ఐదు రూపాయలు దాటుతుందని అంచనా! అంతర్‌రాష్ట్ర రవాణా చార్జీల(ఐఎ్‌సటీసీ) స్థానంలో కేంద్రం ‘జనరల్‌ యాక్సెస్‌’ చార్జీలను తీసుకొచ్చింది. పేరు ఏదైనప్పటికీ.. షాక్‌ మాత్రం షరా మామూలే!

ఒక్కమాటైనా విన్నారా?

‘సెకీ’తో ఒప్పందానికి సంబంధించి ఆర్థిక శాఖ చేసిన కీలకమైన సూచనలేవీ జగన్‌ సర్కారు పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. 2024 సెప్టెంబరు నుంచి సరఫరా చేసే విద్యుత్తుకు 2021లోనే ఒప్పందం చేసుకోవడాన్ని నిపుణులు అప్పట్లోనే తప్పుపట్టారు. ఇప్పుడు... 2024 సెప్టెంబరు దాటి డిసెంబరు వస్తున్నా ‘అదానీ’ నుంచి విద్యుత్తు సరఫరా మొదలు కాలేదు. ఈ పరిణామాన్ని ఆర్థిక శాఖ అప్పట్లోనే ఊహించింది. ‘‘ఈ ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే... సెకీ తనతో ఒప్పందం కుదుర్చుకున్న ఇతర సంస్థల నుంచి రాష్ట్రానికి విద్యుత్తు సరఫరా చేయాలి. ఒకవేళ వేరే సంస్థ విద్యుత్తు ధర తక్కువయితే... దానినే చెల్లించాలి’’ అని ఆర్థిక శాఖ సూచించింది. దీనిని కూడా జగన్‌ సర్కారు పట్టించుకోలేదు. అన్నింటికంటే ముఖ్యంగా... యూనిట్‌ సౌర విద్యుత్తు ధర రూ.2.49ను ప్రామాణికంగా తీసుకోవద్దని కూడా ఆర్థిక శాఖ పేర్కొంది. ‘‘సెకీతో అప్పటికే కుదిరిన ఇతర ఒప్పందాలను చూడండి. ఇంతకంటే తక్కువ ధరకు ఒప్పందాలు ఉంటే... అదే టారి్‌ఫతో మనమూ కొనుగోలు చేయాలి’’ అని పేర్కొంది. ఈ సూచనను కూడా జగన్‌ సర్కారు బుట్టదాఖలు చేసింది. ‘సెకీ’ 2021 మే నెలలో రూ.2.14కే సౌర విద్యుత్తును సరఫరా చేసింది. ఆర్థిక శాఖ సూచన ప్రకారం ఈ ధరనే ప్రామాణికంగా తీసుకుని ‘సెకీ’తో ఒప్పందం చేసుకోవాలి. దీనిని కూడా జగన్‌ సర్కారు పట్టించుకోలేదు.

Updated Date - Nov 30 , 2024 | 06:36 AM