ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: జగన్ ఇక మారరా? అసెంబ్లీ గేటు బయటా గొడవేనా?

ABN, Publish Date - Jul 22 , 2024 | 10:34 AM

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారే సూచనలు అసలు కనిపించడమే లేదు. చివరకు పోలీసులతో కూడా గొడవ పడుతున్నారు. అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారును అనుమతించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారే సూచనలు అసలు కనిపించడమే లేదు. చివరకు పోలీసులతో కూడా గొడవ పడుతున్నారు. అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారును అనుమతించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ 4 వ నంబరు గేటు బయట దిగి లోపలికి వెళ్లేలా నిబంధనలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ శాసన సభపక్ష విన్నపం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఇంతటి బంపరాఫర్ ఇచ్చినా కూడా పోలీసులతో తనను మెయిన్ గేటు నుంచి అసెంబ్లీలోకి వెళ్లనివ్వాలని జగన్ వాగ్వాదానికి దిగారు.


తనను అసెంబ్లీ మెయిన్ గేటు నుంచి వెళ్లనివ్వాలని జగన్ డిమాండ్ చేశారు. అయితే గవర్నర్ వస్తున్నారని అందువలన వేరే గేట్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో గొడవకు దిగారు. శాసన సభ గేట్ వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేయాలని జగన్ సూచించారు. ఆపై పోలీసులు డౌన్ డౌన్ అంటూ గేటు వద్ద వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేశారు. ఇదే సమయంలో గవర్నర్ కాన్వాయ్ రావడంతో వేరే గేట్ నుంచి జగన్ బృందం లోపలకు వెళ్లనివ్వలేదు. చివరకు చేసేది లేక వేరే గేట్ నుంచి జగన్ బృందం లోపలకి వెళ్లింది.


విధుల్లో ఉన్న పోలీసులపై వైఎస్ జగన్ అనుచితంగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. రోజులు ఇలాగే ఉండవంటూ బహిరంగంగా పోలీసులను జగన్ బెదిరించారు. ప్ల కార్డులు, నల్ల కండవాలతో అసెంబ్లీకి వస్తున్న జగన్ ని పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డ్స్, నల్ల కండవాలు తొలగించాలని పోలీసులకు ఎవరు ఇచ్చారు అధికారం అంటూ జగన్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు జగన్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు.

అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 22 , 2024 | 11:51 AM

Advertising
Advertising
<