ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GV Anjaneyulu: జగన్‌వి అన్నీ శవ రాజకీయాలే..

ABN, Publish Date - Jul 24 , 2024 | 10:33 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ఆయన మాట్లాడుతూ..

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ రాష్ట్రం అభివృద్ధి కోసం... నిధుల కోసం వెళ్లారన్నారు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చారన్నారు. జగన్ బాబాయి హత్య నుంచి బయటపడడానికి... కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లారన్నారు.


జగన్ రాష్ట్రం పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టారని జీవీ ఆంజనేయులు అన్నారు. గతంలో కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లారన్నారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో.. ఓ రౌడీ ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఆ రౌడీ కూడా జగన్ పార్టీ వ్యక్తేనన్నారు. వినుకొండలో జరిగిన ఘటనలో ఇద్దరు వైసీపీ నేతలేనన్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో 256 హత్యలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఎందుకు హత్యలు, దాడులకు గురైన కుటుంబాలను పరమర్శించలేదన్నారు.


తాడేపల్లి సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం చేస్తే ఎందుకు పరామర్శించలేదని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. కనీసం మంత్రులు కూడా పరామర్శించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై వైసీపీ ప్రభుత్వంలో హత్యలు, దాడులకు తెగబడ్డారన్నారు. అసెంబ్లీలో 11 మందితో మొహం చూపించలేక.. జగన్ తప్పించుకుంటున్నారన్నారు. జగన్‌ను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏరోజైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? అని నిలదీశారు. జగన్‌ పదవీ కాంక్ష... అవినీతి తప్ప ఇంకో ఆలోచన లేదన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ హ్యాపీ..

పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 24 , 2024 | 10:33 AM

Advertising
Advertising
<