ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మమకారం మాయం!

ABN, Publish Date - Oct 24 , 2024 | 02:46 AM

దాయాదుల మధ్య ఆస్తుల గొడవల గురించి విన్నాం! ఆస్తుల కోసం అన్నదమ్ములు గొడవలు పడటం విన్నాం! భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడమూ సర్వ సాధారణం! కానీ... ఏకంగా తల్లి, చెల్లిపైనే కేసులు వేయడం మాత్రం అత్యంత అసాధారణం! మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌

సొంత తల్లీ చెల్లిపైనే ఎన్‌సీఎల్టీలో జగన్‌ కేసు

వాటాలు, గిఫ్ట్‌డీడ్‌ల రద్దు కోరుతూ పిటిషన్‌.. సరస్వతీ పవర్‌లో తల్లికి పూర్తి వాటా

అంతకుముందే జగన్‌, భారతి గిఫ్ట్‌ డీడ్‌.. బోర్డు ఆమోదంతో వాటాల బదిలీ పూర్తి

చెల్లదంటూ సెప్టెంబరులో జగన్‌, భారతి పిటిషన్‌.. నా తెలివితేటలతో వ్యాపారం

ప్రేమాభిమానాలతో షర్మిలకు కొంత ఇవ్వాలనుకున్నా.. 2019లో ఎంవోయూ

షర్మిలకు కృతజ్ఞత లేదు

నా ప్రేమాభిమానాలు కరిగిపోయాయి

ఆస్తుల్లో వాటా ఇవ్వాలనుకోవడం లేదు

పిటిషన్‌లో జగన్‌ వాదనలు

దాయాదుల మధ్య ఆస్తుల గొడవల గురించి విన్నాం! ఆస్తుల కోసం అన్నదమ్ములు గొడవలు పడటం విన్నాం! భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడమూ సర్వ సాధారణం! కానీ... ఏకంగా తల్లి, చెల్లిపైనే కేసులు వేయడం మాత్రం అత్యంత అసాధారణం! మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ ‘అరుదైన ఘనత’ను సొంతం చేసుకున్నారు. చెల్లి షర్మిల, తల్లి వైఎస్‌ విజయలక్ష్మిపైనే ఆయన నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్టీ)లో గత నెల 9వ తేదీన పిటిషన్‌ దాఖలు చేశారు. తన సొంత తెలివితేటలు, కష్టంతో సంపాదించిన ఆస్తుల్లో షర్మిలకు ప్రేమాభిమానాలతో కొంత వాటా ఇవ్వాలనుకున్నానని... ఇప్పుడు ఆ మమకారం కరిగిపోయిందని తెలిపారు. ఆమె ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. షర్మిలకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ కుదుర్చుకున్న ఒప్పందాన్ని (ఎంవోయూ) రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు... సరస్వతీ పవర్‌లో తన తల్లికి జరిగిన షేర్ల బదిలీ కూడా చెల్లదంటూ ‘కోర్టు’కెక్కారు! చెల్లెలితో జగన్‌ రాయబేరాలు సాగిస్తున్నారంటూ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ సంచలనాత్మక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే! అయితే... అంతకంటే ముందు చాలా జరిగింది. ఒకవైపు జగన్‌ రణభేరి మోగిస్తూనే, మరోవైపు రాయబారాలు సాగిస్తున్నట్లు తేలింది.


మమకారం మాయమైంది!

షర్మిలకు కృతజ్ఞత లేదు.. వాటాలు, గిఫ్ట్‌డీడ్‌లు రద్దు చేస్తున్నా... ఎన్‌సీఎల్టీలో జగన్‌ పిటిషన్‌

  • గ్రంధి ఈశ్వరరావు, గ్రంధి శశికళ, గ్రంధి సతీశ్‌ స్థాపించిన సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఆ కంపెనీ ఎదుగుదలలో మా కష్టం ఎంతో ఉంది.

  • వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి స్వార్జితంతోపాటు వారసత్వ ఆస్తులను భార్య, పిల్లలకు పంచారు. ఆ తర్వాత నేను (జగన్‌) నా సొంత సామర్థ్యంతో, తెలివితేటలతో వ్యాపారాలు చేశాను. ఇలా సం పాదించిన ఆస్తుల్లో కొన్నింటిని కేవలం ‘ప్రేమ, అభిమానం’తో భవిష్యత్తులో షర్మిలకు ఇద్దామ ని భావించాను. ఇలా ఇవ్వాలనుకున్న ఆస్తుల జాబితాతో 2019 ఆగస్టు 31వ తేదీన షర్మిలతో ఎంవోయూ చేసుకున్నాను. ఈ ఆస్తులు నాకు, నా సతీమణికి చెందినవి. అయినప్పటికీ... చెల్లి అనే మమకారంతో షర్మిలకు ఇద్దామనుకున్నాను.

  • ఈడీ, హైకోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో... వాటి నుంచి బయటపడిన తర్వాత మాత్రమే వాటిని షర్మిలకు ఇచ్చేలా ఎంవోయూలో రాసుకున్నాం.

  • సరస్వతీ పవర్‌ కంపెనీలో నా పేరుతో ఉన్న షేర్లను 2021లో మా తల్లికి బదిలీ చేశాం. భారతీ రెడ్డి షేర్లు కూడా బదిలీ అయ్యాయి. దీంతో ఆ కంపెనీలో విజయలక్ష్మికి 48.99 శాతం వాటా వచ్చింది. తదుపరి ఏడాది కంపెనీ వార్షిక రిటర్న్స్‌లో ఈ మేరకు మార్పులు కనిపించాయి. ఆ తర్వాత 2021 జూలై 26న నేను, భారతి కలిసి మాకున్న మిగిలిన షేర్లను కూడా విజయలక్ష్మికి గిఫ్ట్‌డీడ్‌ చేశాం. వాటిని భవిష్యత్తులో మా అనుమతితో షర్మిలకు బదిలీ చేయాలే తప్ప... ఇప్పుడే షర్మిలకు ఇచ్చేసినట్లు కాదు.

  • విజయలక్ష్మి తన పేరుతో ఉన్న ఆస్తులు ఎవరికైనా ఇవ్వొచ్చు. కానీ, ఈ ఆస్తులు లిటిగేషన్‌లో ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతానికి సరస్వతీ పవర్‌లో మెజారిటీ వాటా ఇంకా మాకే (జగన్‌, భారతి, క్లాసిక్‌ రియాల్టీ) ఉన్నట్టు పరిగణించాలి.

  • ఇప్పటిదాకా మేం షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ పత్రాలు ఇవ్వలేదు. గిఫ్ట్‌డీడ్‌ మాత్రమే జరిగింది. అంటే భవిష్యత్‌లో షర్మిలకు బదిలీ కావాల్సిన షేర్లకు విజయలక్ష్మి ట్రస్టీగా మాత్రమే ఉంటారు.

  • ప్రేమాభిమానాలు కరిగిపోవడం వల్ల ఎంవోయూను ముందుకు తీసుకెళ్లి షర్మిలకు ఆస్తులు పంచాలనే ఆలోచనను ఉపసంహరించుకున్నాం. ఆస్తులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎంవోయూ, గిఫ్ట్‌డీడ్‌ చేసుకున్నాం కానీ... వాస్తవమైన పంపకాలు జరగలేదు.

  • షర్మిల, విజయలక్ష్మి, చాగర్రి జనార్దన్‌కు (0.25 శాతం వాటాదారు) సరస్వతి పవర్‌ కంపెనీ షేర్లపై ఎటువంటి హక్కు లేదు. వారికి వాటాలూ లేవు. ఈ ఏడాది జూలై 6వ తేదీన జరిగిన షేర్ల బదిలీ చట్టవిరుద్ధం. అది చెల్లదు.

Updated Date - Oct 24 , 2024 | 02:46 AM