Pawan Kalyan: పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది
ABN, Publish Date - Mar 02 , 2024 | 12:08 PM
పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసిందని పవన్ అన్నారు.
అమరావతి: పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఏపీ (AP)లో తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసిందని పవన్ అన్నారు. ట్యాంకర్ దగ్గరకు తాగు నీరు పట్టుకొనేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లు పట్టుకోరాదని అడ్డుపడటం దారుణమన్నారు.
TS News: అయ్య బాబోయ్.. తెలంగాణలో భర్తలను భార్యలు ఇంతలా చితక్కొడుతున్నారా?
ఇంట్లో నీళ్ళు లేవని ఆమె ప్రాధేయపడ్డా వినకుండా ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపడం చూస్తే.. రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన నడుస్తుందో అందరూ అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు. వైసీపీ వాళ్ళే నీళ్లు తాగాలి... గాలి పీల్చాలని జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉందన్నారు. పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందన్నారు. మల్లవరం ఘటనపై పోలీసులు నిష్పాక్షపాతంగా, అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేయాలన్నారు. మూడేళ్ళ కిందట ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోనే నకరికల్లు ప్రాంతంలో ఎస్టీ మహిళను వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారని పవన్ అన్నారు. ఈ పాలకుడు మాట్లాడితే ‘నా ఎస్టీలు... నా ఎస్సీలు...’ అంటాడని.. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ.. హత్యాకాండ సాగించేవాళ్ళను వెనకేసుకొచ్చే వ్యక్తికి ‘నా ఎస్టీ, నా ఎస్సీ’ అనే అర్హత ఉందా? అని పవన్ ప్రశ్నించారు.
ఇవి చదవండి..
Chandrababu: ప్రజాగళం పేరుతో ఈ నెల 6 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు
Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ పోటీ..? వైసీపీలో గుబులు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2024 | 12:08 PM