ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jogi Ramesh: ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మరీ పరారైన జోగి రమేష్, దేవినేని అవినాష్

ABN, Publish Date - Sep 05 , 2024 | 11:15 AM

టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితులు కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎల్. అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం, జోగి రమేష్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను పోలీసులు పంపించడం జరిగింది.

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితులు కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎల్. అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం, జోగి రమేష్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను పోలీసులు పంపించడం జరిగింది. వైసీపీ రాష్ట్ర యువత అధ్యక్షులు పానుగంటి చైతన్య కోసం వేట సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చైతన్య పరారయ్యాడు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్, విజయవాడ నగర వైసీపీ నేత అవుతు శ్రీనివాస రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మిగిలిన నిందితుల్లో ఆందోళన ప్రారంభమైంది.


మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో పెట్టి మరీ పోలీసులు విచారిస్తున్నారు. జోగి రమేష్, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, రఘురామ్‌లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మరీ పరారయ్యారు. ఇందులో కొందరి ఆచూకీని పోలీసులు కనిపెట్టినట్టుగా సమాచారం. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు కూడా నిన్న ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. జోగి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. జోగి కోసం కూడా ప్రత్యేక బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయి. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. వీరంతా తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకూ ఆయన పరారీలో ఉన్నారు. సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకుని హైదరాబాద్‌కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. సురేష్‌ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 11:21 AM

Advertising
Advertising