ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామీణ విలేకరులే నా గురువులు..

ABN, Publish Date - Nov 11 , 2024 | 04:14 AM

పత్రికారంగంలో ఏ స్థాయిలో ఉన్నా నేర్చుకుంటూ ఉండాలని ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె.శ్రీనివాస్‌ అన్నారు. తాను పత్రికారంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించడాన్ని వృత్తిలో భాగంగా అలవరుచుకున్నానని చెప్పారు.

  • బెజవాడతో అనుబంధానికి సాహిత్యం, పుస్తక ప్రదర్శనలే పునాదులు

  • ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె.శ్రీనివాస్‌

  • ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సత్కారం

విజయవాడ, విజయవాడ కల్చరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : పత్రికారంగంలో ఏ స్థాయిలో ఉన్నా నేర్చుకుంటూ ఉండాలని ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె.శ్రీనివాస్‌ అన్నారు. తాను పత్రికారంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించడాన్ని వృత్తిలో భాగంగా అలవరుచుకున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలోను, సాహితీమిత్రులు నిర్వహించిన మాటామంతీ కార్యక్రమంలోను శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 1984లో ఉదయం పత్రిక మొదటి బ్యాచ్‌లో ట్రైనీ సబ్‌ ఎడిటర్‌గా తన పాత్రికేయ జీవితం విజయవాడలోనే ప్రారంభమైందని ఆయన తెలిపారు.


సాహిత్యం, బుక్‌ ఫెస్టివల్‌, ఇక్కడి సమాజంతో సజీవ సంబంధాలను కొనసాగించడానికి పునాదులయ్యాయని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’లో 17 ఏళ్ల ప్రయాణంలో ప్రజల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించానన్నారు. గ్రామీణ విలేకరులే తనకు గురువులని ఆయన పేర్కొన్నారు. ప్రజాసమస్యలతో పత్రికలు సంబంధాలను కొనసాగించాలని, ఈ పనే ‘ఆంధ్రజ్యోతి’ చేసిందన్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో ముందుచూపుతో వ్యవహరించేవారు ఎంతోమంది ఉన్నారని చెప్పారు.

Updated Date - Nov 11 , 2024 | 04:14 AM