KA Paul: అంబేద్కర్ విగ్రహం సాక్షిగా.. చంద్రబాబు, జగన్‌కి కేఏ పాల్ సవాల్
ABN, Publish Date - Feb 19 , 2024 | 04:53 PM
ఇటీవల వైసీపీ ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇదే సమయంలో.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చలకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌కి సవాల్ విసిరారు.
ఇటీవల వైసీపీ ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇదే సమయంలో.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చలకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌కి సవాల్ విసిరారు. విగ్రహాలు చూసి దళితులు మోసపోరని తేల్చి చెప్పారు. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రావాలని బడుగు, బలహీన వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఆ మూడు పార్టీలు బీజీపీకి తొత్తులని ఆరోపించారు.
అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగాడు కానీ, విగ్రహాలు పెట్టమని అడిగాడా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని, కులాన్ని విమర్శించనని స్పష్టతనిచ్చారు. పవన్ కళ్యాణ్‌కి ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నాడని, చంద్రబాబు ఏమో కుర్చీలు ఎత్తమని చెప్తున్నారని దుయ్యబట్టారు. తాను వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని.. తనతో కలిసి నడవాలని.. వేలకోట్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు.
Updated Date - Feb 19 , 2024 | 05:05 PM