అన్నపూర్ణగా దర్శనమిచ్చిన అమ్మవారు
ABN, Publish Date - Oct 05 , 2024 | 11:57 PM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన శనివారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చి కనువిందు చేశారు.
మదనపల్లె అర్బన, అక్టోబరు5: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన శనివారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చి కనువిందు చేశారు. మదనపల్లె పట్టణంలోని వాసవీభవన వీధిలో వెలసిన వాసవీ కన్యాకాపరమేశ్వరీ దేవి మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అనుబంద సంస్థల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు రామచంద్ర అన్నపూర్ణేశ్వరీ దేవి అలంకరణతో విశేషంగా పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మదనపల్లె ఆర్యవైశ్యసంఘం అథ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్, ఉపాధ్యక్షుడు దేవతా సతీష్, కార్చదర్శి సూరేగిరిధర్ పాల్గొ న్నారు. కోర్టులో వెలసిన గంగమ్మకు పసుపు అలంకరణ చేసి ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్నరెడ్డెప్ప, కార్యదర్శి మార్పూరి ప్రభాకర్‌నాయుడు, ఉపాధ్యక్షుడు పెరవలి వేణుగోపాల్‌నాయుడు, కమిటీ సభ్యులు భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆలయంలో పొంగళ్లు నైవేద్యంగా తెచ్చి అమ్మకు సమర్పించారు. నీరుగట్టువారిప ల్లెలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆలయకమిటీ అధ్యక్షుడు పురాణం చంద్రశేఖర్, కోశాధికారి రామిశెట్టి రత్నమయ్య, కార్యదర్శి పవనకుమార్ల పర్యవేక్షణలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. దేవతానగర్‌లోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని మధురమీనాక్షీదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. దేఽవళంవీధిలోని సోమేశ్వరస్వామిఆలయంలో అమ్మవారిని కనకదుర్గా అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయంలో ఆలయ ఈవో రమణ ఆధ్వర్యంలో ధనలక్ష్మీ అలంకరణ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనపగుట్టలోని అభయలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహుడికి కనకదుర్గ అలంకరణతో పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పూజల్లో పాల్గొన్నారు. కురవంకలోని భువనేశ్వరి ఆలయంలో దుర్గమాతకు విశేషపూజలు నిర్వహించారు.
పీలేరులో: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం పీలేరు గ్రామ దేవత రౌద్రాల అంకాళమ్మ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు. నెహ్రూబజారులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు అన్నపూర్ణా దేవిగా, మోడల్ కాలనీ వద్దనున్న ఎల్లమ్మ, ఇందిరమ్మ కాలనీ వద్దనున్న దిన్నె గంగమ్మలు గాయత్రి దేవి అలంకారాల్లో దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రులతోపాటు పెరటాసి మాసం మూడవ శనివారం కూడా కావ డంతో శనివారం మహిళలు అమ్మవార్లను పెద్దఎత్తున దర్శించుకున్నారు. ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
వాల్మీకిపురంలో: దసరా శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా మండలం లోని సత్యమ్మ దేవత ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలం కరించి పూజలు చేశారు. అలాగే చింతపర్తి వాసవీ ఆలయం, స్థానిక నల్లవీరగంగాభవానీ అమ్మవారి ఆలయం, గొల్లపల్లె విరూపాక్షమ్మ తల్లి ఆలయాల్లో అమ్మవార్లకు అన్నపూర్ణాదేవి అలంకరణలు చేశారు. కోనేటివీధిలోని శివాలయంలో లక్ష్మీకామేశ్వరిదేవికి వైష్ణవిదేవి గాను, బజారువీధిలోని కన్యకాపరమేశ్వరి దేవికి గలజలక్ష్మీదేవి అలంకరణలతో విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల ధర్మకర్తలు పులి సత్యారెడ్డి, కాంతరాజు, సతీష్, రమణారెడ్డి, కువైట్ శంకరాచారి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
కలికిరిలో: స్థానిక గ్రామ దేవత ఎల్లమ్మ దేవత శనివారం అన్నపూ ర్ణాదేవి అలంకరణలో సాక్షాత్కరించారు. ఆలయ నిర్వాహకులు అశోక్‌కు మార్ రెడ్డి, మధుసూదన రెడ్డి, సురేంద్ర రెడ్డి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మీనాక్షి రూపంలో దర్శనమిచ్చి భక్తులకు కనువిందు చేశారు. కలికిరి పంచాయతీలోని చక్కెరవాండ్లపల్లెలో శనివారం వెంకటేశ్వరస్వామి కలా ్యణోత్సవాన్ని వైభవంగా నిర్వహించి, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ని సాయంకాలంలో పల్లకిలో ఊరేగించారు.
కలకడలో:మండలంలోని కోనలో వెలసిన చౌడేశ్వరిదేవి రెండవ రోజైన శనివారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే కలకడలో ని చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజ లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
కురబలకోటలో:దసరాశరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కన్యకాప రమేశ్వరీ అమ్మవారు బాలాత్రిపుర సుందరి అలంకరణలో శనివారం దర్శనమిచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కార్యక్రమంలో బాలకృష్ణ, నాగరాజగుప్త, రామకృష్ణ, సేతు మాధవ్, అమర్నాథ్, గుప్త, మారుతీ కుమార్, రామ్మోహన, అర్చకులు పాల్గొన్నారు.
నిమ్మనపల్లిలో: దశరా నవరాత్రులు సందర్భంగా నిమ్మనపల్లి పంచా యతి పెద్దమాదిగపల్లి వెలసిన మాతమ్మతల్లి ఆలయంలో రెండో రోజు అమ్మ వారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు. ఈ సంధర్బంగా ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టారు. అనంతరం అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
Updated Date - Oct 05 , 2024 | 11:57 PM