చిన్నారి అస్ఫియా మృతిపై విచారణ జరపాలి
ABN, Publish Date - Oct 03 , 2024 | 11:49 PM
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందిన చిన్నారి అస్ఫి యా ఉదంతంపై సమగ్ర విచారణ జర పాలని పీలేరులోని పలు ప్రజాసంఘా లు, ముస్లిం జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
పీలేరు, అక్టోబరు 3: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందిన చిన్నారి అస్ఫి యా ఉదంతంపై సమగ్ర విచారణ జర పాలని పీలేరులోని పలు ప్రజాసంఘా లు, ముస్లిం జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అస్ఫియా మృతికి సంతాపంగా గురువారం పీలేరు పట్టణం లో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ అస్ఫియా మరణానికి కారణమైన వారిని కనిపెట్టి వారికి కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడా లన్నారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అక్కడ అస్ఫియా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు.
చిన్నారి హంతకులను ఉరి తీయాలి
కలికిరి, అక్టోబరు 3: మూడు రోజుల క్రితం పుంగనూరులో అనుమానాస్పద స్థితిలో దారు ణ హత్యకు గురైన ఆస్ఫియా హంతకులను పట్టుకుని ఉరి తీయాలని పలు ప్రజా సం ఘాలు డిమాండు చేశాయి. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలోని గాంఽధీ విగ్రహం ముందు కొవ్వుత్తులు వెలిగించి ఆస్ఫియా చిత్రపటానికి నివాళులర్పించారు. జస్టిస్ ఫర్ ఆస్ఫియా అని రాసిన బ్యానర్లను ప్రదర్శించారు. జమాయితే ఉలేమా-ఏ-హింద్ నాయకుడు ముస్తఫా హజరత, ఎంవీఎస్ మాల విద్యార్థి సంఘం రాయలసీమ అధ్యక్షుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో పలువురు పట్టణ ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Oct 03 , 2024 | 11:50 PM