ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గణేశ నిమజ్జనంలో అపశృతి

ABN, Publish Date - Sep 09 , 2024 | 11:55 PM

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వేంపల్లె గ్రామానికి చెందిన వారు మొగమోరువంక వద్దకు గణేశ విగ్రహాన్ని తెచ్చారు. దీనిని నిమజ్జనం చేస్తుండగా వేంపల్లెకు చెందిన బేల్దారి జారిపాటి రాజా (36), క్రిస్టియన కాలనీకి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ వంశీ (25) ప్రమాదవశాత్తు వంకలో పడిపోయారు.

మృతులు డ్రైవర్‌ వంశీ, బేల్దారి రాజా (ఫైల్‌ ఫొటోలు)

ఇద్దరు వేంపల్లె వాసులు మృతి

వీరపునాయునిపల్లె, సెప్టెంబరు8: మండల పరిధిలోని ఎన.పాలగిరి క్రాస్‌ గోనుమాకులపల్లె మార్గమధ్యంలో ఉన్న మొగమోరువంకలో గణేశ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వేంపల్లె వాసులు మృతిచెందారు.

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వేంపల్లె గ్రామానికి చెందిన వారు మొగమోరువంక వద్దకు గణేశ విగ్రహాన్ని తెచ్చారు. దీనిని నిమజ్జనం చేస్తుండగా వేంపల్లెకు చెందిన బేల్దారి జారిపాటి రాజా (36), క్రిస్టియన కాలనీకి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ వంశీ (25) ప్రమాదవశాత్తు వంకలో పడిపోయారు. వారు పడిన చోట సుడిగండం ఉండటంతో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వేంపల్లె వాసులు స్థానిక ఎస్‌ఐ మంజునాథ, తహసీల్దార్‌ లక్ష్మిదేవికి సమాచారం ఇచ్చారు. పులివెందుల అగ్నిమాపక సిబ్బంది స్థానిక గోనుమాకులపల్లెకు చెందిన మరో నలుగురు కలసి మొగమోరువంకలో దాదాపు 4గంటల పాటు గాలించి ఇద్దరి మృతదేహాలను బయటికి తీశారు. దీనితో అక్కడకు చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బేల్దారి జారిపాటి రాజాకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతిచెందడంతో పెద్ద దిక్కును కోల్పోయామని వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు వంశీ మృతిచెందడంతో అతడి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలాన్ని ఆర్డీఓ వెంకటేశ్వర్లు, రూరల్‌ సీఐ చల్లని దొర పరిశీలించారు.


నిమజ్జనానికి వెళ్లి వస్తూ..

చక్రాయపేట, సెప్టెంబరు 9: వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తూ అదే ట్రాక్టర్‌ కింద పడి ఓ బాలుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... వినాయక చవితి సందర్భంగా సోమవారం భారీఎత్తున వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఇందులో భాగంగా ఆంజనేయపురానికి చెందిన కొందరు విగ్రహాన్ని తీసుకుని కాలేటివాగు డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడ అనుమతించకపోవడంతో కుప్పం గ్రామం సమీపంలోని పాపాఘ్నిలో నిమజ్జనం చేసి వెనుదిరిగారు. మార్గమధ్యంలో నెర్సుపల్లె క్రాస్‌ వద్ద చిలేకాంపల్లెకు చెందిన ట్రాక్టర్‌ యజమాని సత్తార్‌ స్పీడ్‌గా వెళ్లడంతో అందులో ఉన్న గౌతం అదుపు తప్పి కింద పడ్డాడు. అదే సమయంలో ఆదిత్య అనే వ్యక్తి గౌతం చేతిని పట్టుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. కిందపడ్డ గౌతం తలపై ట్రాక్టర్‌ టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. గౌతంది మదనపల్లె వద్ద ఉన్న అంగళ్లు. ఆంజనేయపురంలోని బంధువులో ఇంటిలో ఉంటూ రాయచోటి సాయి కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్‌ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 11:55 PM

Advertising
Advertising