ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gurukulam గురుకులాల్లో సిబ్బందిని నియమించండి

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:21 AM

వంట సిబ్బంది లేక విద్యార్థులకు సకాలంలో భోజనం వడ్డించ లేకున్నామని గురుకుల పాఠశాల సిబ్బంది తమ సమస్యలను ఎస్టీ కమిషన చైర్మన శంకర్‌ నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.

విద్యార్థినులతో మాట్లాడుతున్న శంకర్‌ నాయక్‌

రైల్వేకోడూరు(రూరల్‌) సెప్టెంబరు 20: వంట సిబ్బంది లేక విద్యార్థులకు సకాలంలో భోజనం వడ్డించ లేకున్నామని గురుకుల పాఠశాల సిబ్బంది తమ సమస్యలను ఎస్టీ కమిషన చైర్మన శంకర్‌ నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. గదులు, వంటశాల, మరుగుదొడ్లను పరి శీలించారు. అన్ని గదుల్లో ఫ్యాన్లు, లైట్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య సదుపాయంపై ఆరా తీశారు. ఇటీవల కాలంలో మీడియాలో వచ్చిన అభియోగాలపై వివరణ అడిగి తెలుసుకున్నారు. వంట సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులు వంట చేస్తుంటే స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించా మని విద్యార్థులు చైర్మనకు వివరించారు. పాఠ శాలలో సీసీ కెమెరాలను, రికార్డులను పరిశీలిం చారు. గురుకుల పాఠశాలలో ఉండే సమస్యలను అధికారులు, రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ఇనచార్జ్‌ తహసీల్దార్‌ రెడ్డి ప్రసాద్‌, ప్రఽధానోపాధ్యాయురాలు లత, గురుకుల వార్డెన గీత, హౌసింగ్‌ అధికారి మురళీకృష,్ణ వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్‌, రైల్వేకోడూరు ఎస్‌ఐ నవీన బాబు, ఆర్‌ఐ రాజశేఖర్‌, వీఆర్‌వో తులసి, గురుకుల సిబ్బంది, జడ్పీటీసీ రత్నమ్మ, జనసేన నాయకులు మర్రెడ్డి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:21 AM